OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన ఇంట్రెస్టింగ్ పొలిటిక‌ల్, యాక్ష‌న్, థ్రిల్ల‌ర్‌.. అస‌లు మిస్స‌వ్వోద్దు

ABN , First Publish Date - 2023-11-24T14:38:39+05:30 IST

మ‌ళ‌యాళ సినిమాలు మ‌న తెలుగు వారికి బాగా క‌నెక్ట్ అవుతుండ‌డంతో ఓటీటీ సంస్థలు కూడా ప్ర‌తి వారం రెండు మూడు ప‌ర భాషా సినిమాలకు త‌గ్గ‌కుండా ఇక్క‌డ విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వారం మ‌ళ‌యాళం నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది.

OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన ఇంట్రెస్టింగ్ పొలిటిక‌ల్, యాక్ష‌న్, థ్రిల్ల‌ర్‌.. అస‌లు మిస్స‌వ్వోద్దు
Chaaver

ఈ ఓటీటీల పుణ్య‌మా అని దేశంలోని అన్ని భాష‌ల సినిమాలు మ‌న ఇంటికే మ‌న భాష‌లోనే వ‌స్తున్నాయి. ముఖ్యంగా మ‌ళ‌యాళ సినిమాలు మ‌న తెలుగు వారికి బాగా క‌నెక్ట్ అవుతుండ‌డంతో ఓటీటీ సంస్థలు కూడా ప్ర‌తి వారం రెండు మూడు ప‌ర భాషా సినిమాలకు త‌గ్గ‌కుండా ఇక్క‌డ విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వారం మ‌ళ‌యాళం నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది. అదే కుంచ‌కో బోబ‌న్ (Kunchako Boban) న‌టించిన చావ‌ర్ (Chaaver).

ఆక్టోబ‌ర్ 5న మ‌ళ‌యాళంలో విడుద‌లైన ఈ సినిమా మంచి స్పంద‌న రాబ‌ట్టుకుని విజ‌యం సాధించింది. అరుదుగా వ‌చ్చే పొలిటిక‌ల్, యాక్ష‌న్, థ్రిల్ల‌ర్‌ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు సీటులో కూర్చోబెట్టే సినిమాగా తెర‌కెక్కింది. మ‌ళ‌యళ సూప‌ర్‌స్టార్ కుంచ‌కో బోబ‌న్ (Kunchako Boban) హీరోగా న‌టించ‌గా ఆంటోని వ‌ర్గీస్‌, అర్జున్ ఆశోక‌న్‌, స‌జ్జిన్ గోపు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.


న‌లుగురు రాజ‌కీయ గుండాలు ఓ హ‌త్య కేసులో ఇరుక్కోవ‌డం దాని నుంచి త‌ప్పించుకునేందుకు వారు చేసే పోరాటం, వారి పైన‌ పొలిటిక‌ల్‌ పార్టీలు న‌డిపే రాజ‌కీయం, ప‌గ‌లు, ప్ర‌తీకారాల నేప‌థ్యంలో ఈ సినిమా ఆధ్యంతం ఆక‌ట్టుకునే క‌థ‌నంతో రూపొందించ‌బ‌డింది. సినిమా స్క్రిప్ట్ ప‌రంగా కొద్దిగా ఫెయిల్ అయిన ఈ సినిమా సంగీతం, టెక్నిక‌ల్ బ్రిలియ‌న్స్ అనే పేరు తెచ్చుకుంది.

ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌, సోష‌ల్‌మీడియాలో ఎక్క‌డ చూసిన మ‌న‌కు ఎక్కువ‌గా వినిపిస్తున్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాదే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ సోనీ లివ్‌లో విడుద‌లైంది. సినీ ల‌వ‌ర్స్‌ ఈ సినిమాను అస‌లు మిస్ చేయోద్దు. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది.

Updated Date - 2023-11-24T14:38:41+05:30 IST