Hidimba: ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే!

ABN , First Publish Date - 2023-08-06T14:40:42+05:30 IST

అశ్విన్‌బాబు హీరోగా అనిల్‌ కన్నెగంటి తెరకెక్కించిన సినిమా ‘హిడింబ’. కొత్త కాన్సెప్ట్‌తో ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ఇటీవల విడుదల ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ నెల పదో తేది రాత్రి 7 గంటల నుంచి ఆహా వేదికగా స్ర్టీమింగ్‌ కానుంది.

Hidimba:  ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే!

అశ్విన్‌బాబు (Aswin babu) హీరోగా అనిల్‌ కన్నెగంటి తెరకెక్కించిన సినిమా ‘హిడింబ’(Hidimba). కొత్త కాన్సెప్ట్‌తో ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ఇటీవల విడుదల ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ నెల పదో తేది రాత్రి 7 గంటల నుంచి ఆహా వేదికగా స్ర్టీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆహా (Aha) ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో నందితా శ్వేత హీరోయిన్‌గా నటించగా.. రాజీవ్‌ కనకాల, శుభలేఖ సుధాకర్‌, రఘు కుంచె, దీప్తి కీలక పాత్రల్లో కనిపించారు.

కథ: అభయ్‌ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత) పోలీస్‌ ట్రైనింగ్‌లో ఉండగా ప్రేమించుకుంటారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్‌ ఆఫీసర్‌ అవుతుంది. అభయ్‌ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్‌ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్లిద్దరూ ఓ కేసు విషయమై మళ్లీ కలిసి పని చేయాల్సి వస్తుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్‌ కిడ్నాప్‌లకు సంబంధించిన కేస్‌ అది. దీన్ని ఇన్వెస్టిగేట్‌ చేసే క్రమంలో కాలా బండలోని బోయ అనే ముఠాను పట్టుకుంటారు. వాళ్ల చెరలో ఉన్న అమ్మాయిలు అందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసింది అనుకునేలోపు సిటీలో మరో అమ్మాయి కిడ్నాప్‌ అవుతుంది. మరి ఈ కేసును ఆద్య, అభయ్‌ ఎలా ఛేదించారు? అసలు కిడ్నాప్‌ చేస్తుంది ఎవరు? రెడ్‌ డ్రెస్‌ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యంగా పెట్టుకోవడానికి కారణం ఏంటి? వాళ్లను అతనేం చేస్తున్నాడు? ఈ కథకు అండమాన్‌ దీవుల్లో ఉన్న ఓ ఆదిమ తెగకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది సినిమా ఇతివృత్తం.

Updated Date - 2023-08-06T14:40:42+05:30 IST