RamaBanam: గోపీచంద్ నటించిన రామబాణం,ఓటిటి లో తొందరగా వచ్చేస్తోంది, ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే...

ABN , First Publish Date - 2023-05-24T13:55:08+05:30 IST

గోపీచంద్, డింపుల్ హయతి నటించిన 'రామబాణం' సినిమా ఈమధ్యనే విడుదల అయి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వం చేసిన ఈ సినిమా ఇప్పుడు త్వరగానే ఓటిటి లోకి వచ్చేస్తోంది.

RamaBanam: గోపీచంద్ నటించిన రామబాణం,ఓటిటి లో తొందరగా వచ్చేస్తోంది, ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే...
A still from Rama Banam

గోపీచంద్ (Gopichand), జగపతి బాబు (JagapathiBabu) అన్నదమ్ములుగా నటించిన 'రామబాణం' #RamaBanam సినిమా విడుదల అయి ఇంకా నెలరోజులు కూడా కాలేదు, అప్పుడే ఓటిటి లోకి వచ్చేస్తోంది. ఈ సినిమాకి శ్రీవాస్ (Sriwaas) దర్శకుడు. ఈ సినిమా మీద గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, కానీ సినిమా విడుదల రోజే ఈ సినిమా ఫలితం కూడా తెలిసిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. డింపుల్ హయతి (DimpleHayati) ఇందులో కథానాయిక కాగా, ఖుష్భు (Khushbu) ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషించారు.

Gopichand-pic.jpg

ఈ సినిమాలో కుటుంబ విలువలు ఎన్నో వున్నాయి, మెసేజ్ వుంది అని ఈ సినిమా విడుదలకి ముందు చిత్ర నిర్వాహకులు ఎన్ని చెప్పినా, ఈ సినిమా డిజాస్టర్ గా నిలించింది, అలాగే గోపీచంద్ కి ఇంకో ఫెయిల్యూర్ ని అందించింది. ఎందుకంటే అతనికి బ్రేక్ వచ్చి చాలా ఏళ్ళు అవుతోంది, ఈ సినిమా అయినా ఆ బ్రేక్ ఇస్తుందని ఎంతో ఆశ పడ్డాడు కానీ, ఫలితం లేదు.

ramabanam2.jpg

అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో వచ్చేస్తోంది. సోనీ లివ్ (SonyLiv) ఛానల్ వాళ్ళు ఈ సినిమాని మంచి రేట్ ఇచ్చి తీసుకున్నారు అని తెలుస్తోంది. సినిమా విడుదల అవకముందే ఈ అగ్రిమెంట్ అయినట్టుగా కూడా తెలిసింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయిన ఈ సినిమాని ఓటిటి లో మాత్రం తొందరగానే స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. జూన్ 3 (June 3) వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ ఉంటుంది అని అంటున్నారు. 'రామబాణం' నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ చేసేస్తూ ఉండటం విశేషం.

Updated Date - 2023-05-24T13:55:08+05:30 IST