సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Neetho: అమెజాన్‌లో ఈ రెండక్షరాల మూవీకి సూపర్బ్ రెస్పాన్స్

ABN, First Publish Date - 2023-04-19T20:56:26+05:30

అమెజాన్‌లో విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే నీతో సినిమాకు మిలియన్ వ్యూస్ రావడంతో పాటుగా ట్రెండింగ్‌లో

Neetho Poster
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సున్నితమైన అంశాలను స్పృశిస్తూ దర్శకుడు బాలు శర్మ (Balu Sharma) తెరకెక్కించిన చిత్రం ‘నీతో’ (Neetho). దర్శకుడు రాసుకున్న కథాంశం, ఇద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ బంధానికి సరైన నిర్వచనాన్ని వెతకడానికి హీరోహీరోయిన్లు ప్రయత్నించే తీరు ప్రేక్షకులకు అలా కట్టిపడేస్తుంది. హీరో అభిరామ్ వర్మ (Abhiram Varma), హీరోయిన్ సాత్వికా రాజ్ (Satwika Raj) చాలా ఈజ్‌తో నటించారు. కళ్ళతోనే కొన్ని సీన్స్‌‌లో ఫీల్‌ను బాగా ఎలివేట్ చేశారు. ఇద్దరూ మంచి పరిణితితో కూడిన నటనను కనబరిచారు. హీరో చిన్నాన్న పాత్రలో రాజీవ్ కనకాల (Rajiv Kanakala).. తన నటనానుభవాన్ని ప్రస్ఫుటితంగా ప్రదర్శించారు. ఇటీవల థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను రాబట్టుకుంటోంది.

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సినిమాకు మిలియన్ వ్యూస్ రావడంతో పాటుగా ట్రెండింగ్‌లో ఉండడం విశేషం (Good Response to Neetho in Amazon Prime). పృథ్వీ క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. (Neetho Story)

వరుణ్ (అభిరామ్ వర్మ) ఒక ఇన్సూరెన్స్ కంపెనీ‌లో జాబ్ చేస్తుంటాడు. అయితే, తన ఫ్రెండ్స్‌తో సహా వరుణ్ కూడా టార్గెట్స్‌ను రీచ్ కాలేడు. దాంతో అతని జాబ్ రిస్క్‌లో పడుతుంది. ఇలాంటి సమయంలో వరుణ్‌కి మేఘన (సాత్విక రాజ్) ద్వారా మ్యారేజ్ ఇన్సూరెన్స్ పాలసీ చేసే ఛాన్స్ వస్తోంది. 2 కోట్ల పాలసీతో వరుణ్ అండ్ అతని ఫ్రెండ్స్ జాబ్స్ సేఫ్ అవుతాయి. అయితే, అనుకోకుండా జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మేఘన పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అనంతరం వరుణ్‌కి – మేఘన‌కి మధ్య రిలేషన్ మొదలవుతుంది. ఇద్దరి మధ్య కలిగిన ఫీలింగ్స్ ప్రేమా? కాదా? అనే విషయంలో క్లారిటీ కోసం ఇద్దరు ఎదురు చూస్తుంటారు. మరీ ఈ ఇద్దరికీ తమ లవ్ విషయంలో స్పష్టత వచ్చిందా? చివరకు వారి లవ్ స్టోరీ ఎలా ముగిసింది? అనేదే ఈ చిత్ర కథ.

Updated Date - 2023-04-19T20:59:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!