OTT: ఈ వారం.. ఓటీటీలోకి వ‌స్తున్న చిత్రాలివే

ABN , Publish Date - Dec 20 , 2023 | 04:10 PM

ఎప్ప‌టిలానే ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి దాదాపు 40 సినిమాలు డిజిట‌ల్ స్రీమింగ్‌కు రానున్నాయి. వీటిలో గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఆదికేశ‌వ‌, స‌ప్త‌సాగ‌రాలు దాటి, వంటి సినిమాలతో పాటు మ‌రికొన్ని డ‌బ్బింగ్ చిత్రాలు వెబ్ సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అవేంటో ఏ ఫ్లాట్‌ఫాంల‌లో వ‌స్తున్నాయో తెలుసుకుని వీక్షించండి.

OTT: ఈ వారం.. ఓటీటీలోకి వ‌స్తున్న చిత్రాలివే
OTT

ఎప్ప‌టిలానే ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి దాదాపు 40 సినిమాలు డిజిట‌ల్ స్రీమింగ్‌కు రానున్నాయి. వీటిలో గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఆదికేశ‌వ‌, స‌ప్త‌సాగ‌రాలు దాటి, వంటి సినిమాలతో పాటు మ‌రికొన్ని డ‌బ్బింగ్ చిత్రాలు వెబ్ సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అవేంటో ఏ ఫ్లాట్‌ఫాంల‌లో వ‌స్తున్నాయో తెలుసుకుని వీక్షించండి.

Netflix (నెట్‌ఫ్లిక్స్)

Aadi keshava (ఆదికేశ‌వ‌) Dec 22

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, శ్రీలీల న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఆదికేశ‌వ‌. న‌వంబ‌ర్ 24న థియేట‌ర్ల‌లోకి విడుద‌లైన ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా నిలవ‌గా డిసెంబ‌ర్ 22 (శుక్ర‌వారం) నుంచి స్ట్రీమింగ్ జ‌రుగ‌నుంది.

Kuiko (కుయికో) Tam, Tel, Mal, Kan Dec 22

త‌మిళంలో వ‌చ్చిన కుయికో అనే వ్యంగ్య హ‌స్య చిత్రం న‌వంబ‌ర్‌24న థియేట‌ర్లలో విడుద‌ల‌యింది. విధార్థ్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 22 (శుక్ర‌వారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో త‌మిళ‌,తెలుగు,మ‌ళ‌యాళం,క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ జ‌రుగ‌నుంది.

Rebel Moon (రెబెల్ మూన్) Tam, Tel, Mal, Kan Dec 22

డీసీ చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న జాక్ స్నైడర్ దర్శకత్వంలో రూపొందించిన రెబ‌ల్ మూన్ అనే స్పేస్ ఆడ్వెంచ‌ర్ చిత్రాన్ని డిసెంబ‌ర్ 22 నుంచి తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ చేయ‌నున్నారు.

Trevor Noah (ట్రెవర్ నోహ్) Eng Dec 19

MAESTRO (మాస్ట్రో) Eng, Hin Dec 20

Cindy la Regia (సిండీలా రేగియా) Spa, Eng Dec 20

Dragons of Wonderhatch (డ్రాగన్స్ ఆఫ్ వండర్‌హాచ్) Eng Dec 20

The Taming of the Shrewd 2 (ది టేమింగ్ ఆఫ్ ది ష్రూడ్ 2) Eng Dec 20

Like flowers in sand (లైక్ ఫ్లవర్స్ ఇన్ శాండ్) Ko Dec 21

Jeongsong Creature (జియోంగ్ సోంగ్ క్రియేచర్) Eng Dec 22

Vampire in the Family (వాంపైర్ ఇన్ ది ఫ్యామిలీ) Eng Dec 24

Prime Video IN (అమెజాన్ ప్రైమ్ వీడియో)

Sapta Sagaralu Dhaati (Side B) (సప్తసాగరాలు దాటి- సైడ్ బి) Dec 22

రిష‌బ్‌శెట్టి, రుక్మిణి వ‌సంత్ న‌టించిన ఫ్యామిలీ, ఎమోష‌న‌ల్ డ్రామా చిత్రం న‌వంబ‌ర్ 17న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. డిసెంబ‌ర్ 22 నుంచి ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Tiger3 టైగ‌ర్3 Hin, Tel, Tam Dec 31

స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన హో ఓల్టేజీ యాక్ష‌న్ చిత్రం టైగ‌ర్3. 2023 దీపావ‌ళికి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా దాదాపు రూ.600 కోట్ల క‌లెక్షన్లు రాబ‌ట్టి విజ‌యం సాధించింది. డిసెంబ‌ర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ జ‌రుగనుంది.

The Hunger Games (ది హంగ‌ర్ గేమ్స్‌) Eng Dec 19 Rent

Mission Start Ab (మిషన్ స్టార్ట్ అబ్) Hin series Dec 19

Dry day (డ్రై డే) Hin Dec 22

Salt burn (సాల్ట్ బర్న్) Eng Dec 22


Disney Plus HS (డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌)

Mangalavaaram (మంగ‌ళ‌వారం)

పాయ‌ల్ రాజ్‌పుత్ (Payal Rajput), ప్రియ‌ద‌ర్శి న‌టించిన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మంగ‌ళ‌వారం. న‌వంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 22 మంగ‌ళ‌వారం రోజు నుంచి డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

The Creator (2023) Eng (Original) Dec 20

CallingSahasra JAN 1

Aha videoIN (ఆహా)

Karimnagars Most Wanted (క‌రీంన‌గ‌ర్ మోస్ట్ వాంటెడ్) Dec 22

బాలాజీ భువ‌న‌గిరి ద‌ర్శ‌క‌త్వంలో అమ‌న్‌, సాయి హీరోలుగా న‌టిస్తోన్న క‌రీంన‌గ‌ర్ మోస్ట్ వాంటెడ్ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా డైరెక్ట్ డిసెంబ‌ర్ 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

KeedaaCola (కీడా కోలా) Dec 29

ఈ న‌గ‌రానికి ఏమైంది,పెళ్లి చూపులు వంటి హిట్ చిత్రాల త‌ర్వాత తరుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం కీడా కోలా. ఆక్టోబ‌ర్ నెల చివ‌రి వారంలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా యావ‌రేజ్‌గా నిలిచింది. డిసెంబ‌ర్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

SonyLIV (సోనీ లివ్‌)

TOBY (టోబీ) Dec 22

.క‌న్న‌డ‌నాట విల‌క్ష‌ణ న‌టుడు,ద‌ర్శ‌కుడు రాజ్ బీ శెట్టి(Raj B Shetty) హీరోగా వ‌చ్చిన చిత్రం టోబీ. ఆగ‌స్టులో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెండ‌ర్ 22 నుంచి సోనిలీవ్‌లో డిజిట‌ల్ స్ట్రీమింగ్ తీసుకు వ‌స్తున్నారు.

ZEE 5 Telugu (జీ5)

Annapoorani (అన్న‌పూర్ణి) Dec 29

న‌య‌న‌తార న‌టించిన అన్న‌పూర్ణి చిత్రం డిసెంబ‌ర్ మొద‌టి వారంలో థియేట‌ర్ల‌లోకి హిట్ సాధించింది. డిసెంబ‌ర్ 29 నుంచి జీ 5లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు.

Once Upon Two Times (వన్స్ అపాన్ టూ టైమ్స్) Hin Dec 29

Updated Date - Dec 20 , 2023 | 06:03 PM