ఒళ్లు గ‌గుర్పొడిచే డాక్యుమెంట‌రీ.. ఓటీటీలో ఓ కుటుంబంలో గృహిణి జ‌రిపిన దారుణ‌ హ‌త్యాకాండ‌

ABN , Publish Date - Dec 26 , 2023 | 07:33 PM

వారం వారం చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వ‌స్తుంటాయి. కానీ చాలా అరుదుగా ఇలాంటి డాక్యుమెంట‌రీస్ వ‌స్తుంటాయి. ఈ మ‌ధ్య జీ5లో వ‌చ్చిన వీర‌ప్ప‌న్ ఎంత సెన్షేష‌న్ సృష్టించిందో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో వ‌చ్చిన క‌ర్రీ అండ్ సైనేడ్ ది జాలీ జోసెఫ్ కేసు అనే గంట 36 నిమిషాల నిడివితో గ‌ల‌ డాక్యుమెంట‌రీ ఓటీటీని షేక్ చేస్తున్న‌ది.

ఒళ్లు గ‌గుర్పొడిచే డాక్యుమెంట‌రీ.. ఓటీటీలో ఓ కుటుంబంలో గృహిణి జ‌రిపిన దారుణ‌ హ‌త్యాకాండ‌
Curry & Cyanide: The Jolly Joseph Case

వారం వారం చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వ‌స్తుంటాయి. కానీ చాలా అరుదుగా ఇలాంటి డాక్యుమెంట‌రీస్ వ‌స్తుంటాయి. ఈ మ‌ధ్య జీ5లో వ‌చ్చిన వీర‌ప్ప‌న్ ఎంత సెన్షేష‌న్ సృష్టించిందో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో వ‌చ్చిన క‌ర్రీ అండ్ సైనేడ్ ది జాలీ జోసెఫ్ కేసు (Curry & Cyanide: The Jolly Joseph Case) అనే గంట 36 నిమిషాల నిడివితో గ‌ల‌ డాక్యుమెంట‌రీ ఓటీటీని షేక్ చేస్తున్న‌ది. మ‌నం మునుపెన్న‌డు చూడ‌ని విధంగా వాస్తవ సంఘటనల ఆధారంగా ఓకే కుటుంబంలో ఓ సాధార‌ణ గృహిణి జ‌రిపిన హ‌త్యా కాండ‌ గురించి ఇందులో కులంక‌శంగా వివ‌రించారు.

తీస్తే సినిమాగా మారే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్న ఈ క‌థ వింటే ఒళ్లు గ‌గుర్పొవ‌డం ఖాయం. విష‌యానికి వ‌స్తే 2002 నుంచి 2016 మ‌ధ్య కేర‌ళ‌లోని కూడతాయి అనే గ్రామంలో జాలీ జోసెఫ్ (Jolly Joseph) అనే ఓ సాధార‌ణ గృహిణి ఇంట్లోని వారంద‌రితో క‌లుపుగోలుగా,వాళ్లంద‌రికి చేదోడువాదోడుగా ఉంటూనే ఒక‌రికి తెలియ‌కుండా మ‌రోక‌రిని చంపేసింది. ఆస్థి కోసం రెండేండ్ల‌కు ఒక‌రి చోప్పున ఆఖ‌రుకు సొంత భ‌ర్త‌ను కూడా క‌డ‌తేర్చిన ఓ క‌సాయి మ‌హిళ వారిని ఏ విధంగా చంపిందనే నిజ‌జీవిత క‌థ అధారంగా ఈ డాక్యుమెంట‌రీని తెర‌కెక్కించారు.


ఆ త‌ర్వాత ఈ కేసు ఎలా వెలుగులోకి వ‌చ్చింది, పోలీసులు ఎలా చేధించారు, చివ‌ర‌కు ఏమైంద‌నే ఆస‌క్తిక‌రమైన వాస్త‌వ అంశాల‌ను ఆ ఫ్యామిలీ మెంబ‌ర్స్ వాయిస్‌తోనే వివ‌రించారు. ఇదంతా చూశాక ఇలాంటి మ‌హిళ‌లు కూడా ఉంటారా అని మ‌నం ముక్కు మీద వేలేసుకోవ‌డం ఖాయం. ఇప్పుడు ఈ డాక్యుమెంట‌రీని నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో డిసెంబ‌ర్ 22 నుంచి మ‌ళ‌యాళంతో పాటు తెలుగు త‌మిళ‌,హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది. మీకు ఏ మాత్రం స‌మ‌యం దొరికినా ఈ కార్య‌క్ర‌మాన్ని చూసేయండి. డోంట్ మిస్‌

Updated Date - Dec 26 , 2023 | 07:33 PM