Anurag Thakur: సృజనాత్మక పేరిట హద్దులు దాటితే సహించేది లేదు

ABN , First Publish Date - 2023-03-20T15:29:19+05:30 IST

కరోనా అనంతరం ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను వాడే వారి సంఖ్య అధికమైంది. ప్రతి ఒక్కరి దగ్గర నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), డిస్నీ+హాట్‌స్టార్ (Disney+Hot Star) వంటి సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయి.

Anurag Thakur: సృజనాత్మక పేరిట హద్దులు దాటితే సహించేది లేదు

కరోనా అనంతరం ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను వాడే వారి సంఖ్య అధికమైంది. ప్రతి ఒక్కరి దగ్గర నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), డిస్నీ+హాట్‌స్టార్ (Disney+Hot Star) వంటి సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ లేకపోవడంతో అసభ్య పదజాలం, మితి మీరిన శృంగారానికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా ఓటీటీలో వచ్చే కంటెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసారా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. సృజనాత్మక పేరిట హద్దులు మిరితే చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనురాగ్ ఠాకూర్ మార్చి 19న ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటీటీలకు హద్దులు ఉండాలని సూచించారు. ‘‘తొలి దశలోనే ఫిర్యాదులను నిర్మాతలు పరిష్కరించాలి. ఈ స్థాయిలో 90 శాతం నుంచి 92 శాతం వరకు పరిష్కరించవచ్చు. కంటెంట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తే ఈ కంప్లైట్స్‌తో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసోసియేషన్ స్థాయిలోను కంప్లైట్స్‌ను పరిష్కరించవచ్చు. చివరకు ప్రభుత్వం వంతు వస్తుంది. నియమ, నిబంధనలకు అనుగుణంగా డిపార్ట్‌మెంటల్ కమిటీ ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. అయితే, కొన్ని రోజులుగా ప్రభుత్వానికి విపరీతంగా ఫిర్యాదులు అందుతున్నాయి. డిపార్ట్‌మెంట్ వీటిని సీరియస్‌గా తీసుకుంటుంది. సృజనాత్మక పేరిట అసభ్య పదజాలాన్ని వాడితే సహించేది లేదు. ఓటీటీ కంటెంట్ విషయంలో ఎవరైనా హద్దులను దాటితే మేం ఒప్పుకునేది లేదు. ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం వెనుకడుగు వేయదు’’ అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Updated Date - 2023-03-20T15:31:48+05:30 IST