Skanda: ఓటీటీలోకి ‘స్కంద‌’.. తేదీ మార్పు.. ఎప్ప‌టినుంచంటే

ABN , First Publish Date - 2023-10-28T15:15:14+05:30 IST

మ‌రో సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. రామ్ పోతినేని(RAmPOthineni), శ్రీలీల(Sree leela), స‌యి మంజ్రేక‌ర్‌(Saiee Manjrekar) జంట‌గా బోయ‌పాటి శ్రీను(Boyapati Sreenu) ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స్కంద(Skanda) సినిమా ఓటీటీ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. మొద‌ట ఈ స‌నిమా ఆక్టోబ‌ర్ 27 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగినా కొన్ని అనివార్య కార‌ణాలతో వాయిదా వేశారు. అయితే శ‌నివారం డిస్నీ హ‌ట్‌స్టార్(Hotstar) న‌వంబ‌ర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Skanda: ఓటీటీలోకి ‘స్కంద‌’.. తేదీ మార్పు.. ఎప్ప‌టినుంచంటే
Skanda

మ‌రో సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. రామ్ పోతినేని(RAmPOthineni), శ్రీలీల(Sree leela), స‌యి మంజ్రేక‌ర్‌(Saiee Manjrekar) జంట‌గా బోయ‌పాటి శ్రీను(Boyapati Sreenu) ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స్కంద(Skanda) సినిమా ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. సెప్టెంబ‌ర్ 28న విడుద‌లైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని సినీ అభిమానుల‌ను నిరాశ ప‌ర్చింది.

rampothineni-skanda2.jpg

మొద‌ట ఈ సినిమా అక్టోబ‌ర్ 27 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగినా.. కొన్ని అనివార్య కార‌ణాలతో వాయిదా వేశారు. అయితే శ‌నివారం డిస్నీ ప్లస్ హ‌ట్‌స్టార్(Hotstar) సంస్థ‌ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి న‌వంబ‌ర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది.


SkandaFirstDayCollection1.jpg

ఎన్నో అంచ‌నాలతో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ‘స్కంద’ అర్థంప‌ర్థం లేని సన్నివేశాలు, లాజిక్‌లు లేని హింసాత్మ‌క స‌న్నివేశాలు, ప‌దినిమిషాల‌కోసారి వ‌చ్చే ఫైటింగ్, ప్ర‌తి క్యారెక్టర్‌తో బిల్డ‌ప్ షాట్లు, శృతిమించిన సంగీతం, ఒక‌టీ అరా మినహా ఆక‌ట్టుకోని పాట‌ల‌తో సినిమా ఆసాంతం ప్రేక్ష‌కుల స‌హానానికి ప‌రీక్ష పెట్ట‌డంతో మొద‌టి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల ప‌డింది. బోయ‌పాటి, రామ్(RAmPOthineni) , శ్రీలీల(Sree leela) చ‌రిష్మాతో ఫ‌స్ట్ వీక్ కొద్దొగొప్పో క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఇక న‌వంబర్ 2 నుంచి డిస్నీ ప్లస్ హ‌ట్‌స్టార్‌లో రానున్న ఈ సినిమా జ‌నాల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Updated Date - 2023-10-28T17:30:13+05:30 IST