కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mr Pregnant on OTT: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన సినిమా ఓటిటి లోకి వచ్చేస్తోంది, ఎక్కడంటే...

ABN, First Publish Date - 2023-09-28T19:22:16+05:30

క్రిటిక్స్ చేత మెప్పించబడిన చిత్రం 'మిస్టర్ ప్రెగ్నంట్'. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ దీనిలో కథానాయకుడు కాగా వింజనంపాటి శ్రీనివాస్ దర్శకుడు. మగవాడు గర్భం దాలిస్తే అన్న ఆసక్తికరమైన కథానేపధ్యంలో వచ్చిన ఈ సినిమా త్వరలో ఓటిటి లో ప్రసారం కానుంది

A still from Mr Pregnant, the film is going to stream in a OTT soon

బిగ్ బాస్ #BiggBoss రియాలిటీ షోతో బాగా పేరు సంపాదించుకున్న నటుడు సోహైల్ (Sohel). అతను నటించిన 'మిస్టర్ ప్రెగ్నంట్' #MrPregnant సినిమా ఆమధ్యన విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి మంచి మార్కులు వేశారు. వింజనంపాటి శ్రీనివాస్ (VinjanampatiSrinivas) దీనికి దర్శకుడు కాగా, ఇందులో రూప కొడువాయుర్ (RoopaKoduvayur) కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఇంకా బ్రహ్మాజీ (Brahmaji), సుహాసిని మని రత్నం (SuhasiniManiRatnam), రాజా రవీంద్ర (RajaRavindra) మున్నగు నటీనటులు నటించారు. అప్పిరెడ్డి (AppiReddy) ఈ సినిమాకి నిర్మాత. ఆగస్టు 18న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేస్తోంది.

ఇంతకీ ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు అంటే, ఆహ #Aha ఓటిటి ఛానల్ లో అక్టోబర్ 6న స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథా నేపధ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భార్య మీద ప్రేమతో, తన తల్లికి జరిగిన ఒక సంఘంటతో, ఇందులో కథానాయకుడు భార్యకి బదులు తాను గర్భం దాలుస్తాను అని చెప్తాడు. మొదట్లో అందరూ వ్యతిరేకించినా, అవదు అని చెప్పినా, అతను డాక్టర్ని ఎందుకు కాదు ప్రయత్నం చెయ్యమని చెప్తాడు.

ఆలా ప్రయత్నం చేసాక అది విజయవంతం అవుతుంది. అయితే అక్కడ నుండి అతనికి కష్టాలు మొదలవుతాయి. సమాజంలో మగవాడు గర్భం దాల్చటం ఏమిటని ప్రజలు వింతగా చూడటం, అది వార్తల్లో రావటం, ఇదంతా చూసిన కథానాయకుడు ఏమి చేసాడు, ఎలా వారికి తగిన సమాధానం చెప్పాడు అనేది ఒక భావోద్వేగమైన సన్నివేశాలతో ఈ సినిమా కథ ఉంటుంది.

Updated Date - 2023-09-28T19:22:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!