Bigg Boss 7: నువ్వేడుస్తుంటే పాలలెక్కొస్తున్నాయి, రతిక ప్రశాంత్ ల ప్రేమ మళ్ళీ మొదలయింది

ABN , First Publish Date - 2023-09-19T16:09:06+05:30 IST

బిగ్ బాస్ 7లో మళ్ళీ ప్రశాంత్, రతిక లు దగ్గరవుతున్నట్టుగా కనపడుతోంది. అలాగే శివాజీ చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అతనితో చాలా క్లోజ్ గా వున్న దామిని అతన్ని నామినేట్ చెయ్యడంతో. తేజ, సందీప్ ఎవరి గురించి గాసిప్ కొడుతున్నారో తెలుసా...

Bigg Boss 7: నువ్వేడుస్తుంటే పాలలెక్కొస్తున్నాయి, రతిక ప్రశాంత్ ల ప్రేమ మళ్ళీ మొదలయింది
Prashanth and Rathika

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 #TeluguBiggBoss7 మూడో వారం ఆసక్తికరంగా సాగుతోంది. ఇంట్లోచి ఇద్దరు సీనియర్ నటీమణులు కిరణ్ రాథోడ్ (KiranRathod), షకీలా (Shakeela) ఇద్దరూ ఇంట్లోంచి బయటకి వచ్చేసారు. ఇప్పుడు మూడో వారం నామినేషన్ ల ప్రక్రియ కూడా మొదలైపోయింది. ఈరోజు రాత్రి ఎవరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది. శివాజీ (Sivaji) హౌస్ లో ఇప్పుడు సీనియర్, అతను దామిని (Damini) గురించి మాట్లాడుతూ ఆమె సేఫ్ గేమ్ ఆడుతోంది అని చెప్పాడు.

biggboss71.jpg

ఎందుకంటే ఆమె మొదట తనతో బాగానే ఉందని, అయితే సడన్ గా డిస్ కనెక్టు అయిపోయిందని ఎందుకు తనని నామినేట్ చేసిందో అని చెపుతున్నాడు శివాజీ. అయితే దామిని అప్పుడు స్విమ్మింగ్ పూల్ ఒక్కర్తే వుంది. ఇక ఇంకో దగ్గర తేజ, సందీప్ (Sandeep) కూర్చొని ప్రశాంత్ (Prashanth) మీద గాసిప్ కొట్టారు. ప్రశాంత్ ని ఎవరూ నామినేట్ చెయ్యలేదని అంటే తేజ తను నామినేట్ చేసానని చెప్పాడు. సిల్లీ రీజన్స్ చెపుతున్నాడు అని అన్నాడు సందీప్.

biggboss72.jpg

మళ్ళీ రాత్రి అయినా తరువాత రతిక (Rathika) ఒక్కర్తే కూర్చొని బాధపడుతూ ఉంటే, శివాజీ తింటూ ఏమైంది అని అడిగాడు. ఆమె వెంటనే మైండ్ ఆఫ్ అయిందని సమాధానం చెప్పింది రతిక. ఎందుకు ఏమి జరిగింది అంటూ శివాజీ గుచ్చి గుచ్చి అడిగాడు, కానీ రతిక ఏడుస్తోంది. అప్పుడే ప్రశాంత్ వచ్చాడు, ఏంటి నువ్వు ఏడుస్తుంటే పాలలెక్క వస్తున్నాయి, నీళ్లు రావటం లేదు, పాలసముద్రం దాచావా అని అన్నాడు. దానితో రతిక ఏడుపు ఆపి నవ్వటం మొదలెట్టింది. ప్రశాంత్ మళ్ళీ పులిహోర కలుపుతున్నారు అని ప్రేక్షకులకి అర్థం అవుతోంది. అయితే రతిక, ప్రశాంత్ ల ప్రేమాయణం మళ్ళీ మొదలైనట్టుగా కనపడుతోంది అనే చెప్పాలి. మొత్తానికి ఒకరి మీద ఇంకొకరు గాసిప్ బాగానే మాట్లాడుకుంటున్నారు.

Updated Date - 2023-09-19T16:09:06+05:30 IST