ATM Trailer: దోపిడి, పొలిటిక‌ల్ కుట్ర, పోలీసులు.. ఇంట్రస్టింగ్

ABN , First Publish Date - 2023-01-12T19:47:39+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘ATM’ జనవరి 20 నుంచి జీ 5లో ప్రీమియర్ కానుంది. దిల్ రాజు ప్రొడక్ష‌న్స్

ATM Trailer: దోపిడి, పొలిటిక‌ల్ కుట్ర, పోలీసులు.. ఇంట్రస్టింగ్
ATM Web Series Team

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘ATM’ జనవరి 20 నుంచి జీ 5లో ప్రీమియర్ కానుంది. దిల్ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను తాజాగా మేకర్స్ విడుద‌ల చేశారు. జ‌గ‌న్ (బిగ్ బాస్ తెలుగు విజేత వి.జె.స‌న్నీ VJ Sunny), పోలీస్ ఆఫీస‌ర్ (సుబ్బ‌రాజ్ (Subbaraj) ) మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే ఏటీఎం. దోపిడి ప్ర‌ధానంగా సాగే యాక్ష‌న్ క్రైమ్ డ్రామాలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్‌, రా ఎలిమెంట్స్ ఇత‌ర ఎలిమెంట్స్ అన్నీ మిళిత‌మై ఉంటాయని మేకర్స్ తెలుపుతున్నారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే జ‌గ‌న్ పాత్ర‌ధారి మ‌నిషి ఎద‌గ‌డానికి స‌రైన మార్గం.. త‌ప్పుడు మార్గాల గురించి మాట్లాడుతాడు. అత‌డు ద‌ర్జాగా, విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌టానికి ఎలాంటి మార్గం ఎంచుకున్నాడనేదే క‌థాంశం. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో దీన్ని ఎంగేజింగ్‌గా తెర‌కెక్కించారు. న‌లుగురు కుర్రాళ్లు రూ.25 కోట్ల‌ను దోపిడి చేస్తారు. దాని చుట్టూ పొలిటిక‌ల్ కుట్ర ర‌న్ అవుతుంది. మ‌రి దీన్ని పోలీసులు ఎలా ఛేదించారు అనే పాయింట్ చుట్టూ కథ రన్ అవుతుంది. ట్రైలర్ గమనిస్తే ఆ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఆ దోపిడి త‌ర్వాత మ‌నుగ‌డ కోసం చేసే పోరాటమే ATM. ట్రైల‌ర్‌లోని అంశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఎంగేజింగ్‌గా ఉన్నాయి. బిగ్ బాస్ విన్న‌ర్ వీజే స‌న్నీ, కృష్ణ‌, ర‌విరాజ్‌, రాయ‌ల్ శ్రీ, దివి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సి.చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌శాంత్ ఆర్‌. విహారి సంగీతం స‌మ‌కూర్చారు. ఈ వెబ్ సిరీస్‌ను సిరీస్‌ను హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మించారు. కాగా హరీష్ శంకర్ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. (ATM Trailer Out)

ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్‌ శంకర్ మాట్లాడుతూ.. ‘‘కరోనా కంటే ముందు ఈ కథను రాసుకున్నాను. కరోనా టైమ్‌లో ఇంకా డెవలప్ చేశాను. ఓటీటీలకు రాస్తే క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది. మంచి కంటెంట్‌ను జనాల ముందుకు తీసుకురావడానికి ఫైనాన్షియల్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని తరువాత నాకు అనిపించింది. ఏటీఎం సినిమాకు ప్రశంసలు వస్తే.. అవన్నీ దర్శకుడు చంద్ర మోహన్‌కు మాత్రమే దక్కాలి. సినిమాను అద్భుతంగా తీశారు. బడ్జెట్ విషయంలో సహకరించిన జీ5 టీంకు థాంక్స్. హర్షిత్, హన్షితకు వెల్కమ్. జీ5 టీం మాకు ఎంతో సహకరించారు. మా కోసం ఎన్నో రూల్స్ బ్రేక్ చేశారు. వారి వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత క్వాలిటీగా వచ్చింది. రెండో సీజన్ కూడా రాబోతోంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జనవరి 20న జీ5లో రాబోతోంది’’ అని అన్నారు.

జీ 5 కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దేశ సాయితేజ్ మాట్లాడుతూ ‘‘ ATM ఓ గేమ్ చేంజ‌ర్‌. తెలుగు ఓటీటీ రంగంలో ఇది క‌చ్చితంగా గేమ్ చేంజ‌ర్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. మాకు న‌మ్మ‌కం ఉంది. 2003లో దిల్ రాజుగారు నిర్మాత‌గా దిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు 2023లో ఓటీటీలోకి ఏటీఎంతో అడుగు పెట్టారు. జ‌న‌వ‌రి 20న ఈ సిరీస్ రిలీజ్ అవుతుంది. అప్పుడు దిల్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ఇప్పుడు ఓటీటీలో ఏటీఎం కూడా అదే రేంజ్‌లో హిట్ అవ‌నుంది. ఈ సిరీస్‌కు అద్భుత‌మైన క‌థ‌ను అందించిన హ‌రీష్‌గారికి, అంతే అద్భుతంగా తెరకెక్కించిన చందుగారికి థాంక్స్‌. ప్ర‌తీ పండుగ‌కు ఇక అంద‌రూ జీ5 వైపు కంటెంట్ కోసం చూస్తారు. అంత గొప్ప కంటెంట్ రానుంది. ఈ ఏడాదిని ఏటీఎంతో ప్రారంభిస్తున్నాం. ప్ర‌తి నెల ఓ కొత్త వెబ్ సిరీస్‌తో పాటు ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం..’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హర్షిత్ రెడ్డి, హన్షిత, దర్శకుడు చంద్ర మోహన్ మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ చాలా బాగా వచ్చిందని తెలిపారు.

Updated Date - 2023-01-12T19:47:40+05:30 IST