Animal: సినిమానే రిలీజ్ కాలే.. అప్పుడే ‘యానిమల్’ ఓటీటీ డేట్ ఫిక్స్! ఎప్పటి నుంచంటే?

ABN , First Publish Date - 2023-11-30T16:13:08+05:30 IST

ఇప్పుడు దేశమంతటా మారుమ్రోగుతున్న పేరు యానిమల్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, బాబీ డియోల్, అనీల్ కపూర్, రష్మిక మందన వంటి బిగ్ స్టార్స్ నటిస్తున్నారు. చిత్రం థియేటర్లలోకి రాకముందే ఓటీటీలో ఏ రోజు వచ్చే డేట్ ను కూడా లాక్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Animal: సినిమానే రిలీజ్ కాలే.. అప్పుడే ‘యానిమల్’ ఓటీటీ డేట్ ఫిక్స్! ఎప్పటి నుంచంటే?
animal

ఇప్పుడు దేశమంతటా మారుమ్రోగుతున్న పేరు యానిమల్ (Animal). తెలుగు యువ దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), బాబీ డియోల్ (Anil Kapoor), అనీల్ కపూర్ (Anil Kapoor), రష్మిక మందన (Rashmika Mandanna) వంటి బిగ్ స్టార్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఏ యువకుడినైనా, సిమాలపై అవగాహాన ఉన్న ఏ ఒక్కరిని టచ్ చేసినా దీని గురించే చెబుతున్నారు. టీజర్ రిలీజ్ రోజు నుంచే ఓ స్థాయిలో ఈ చిత్రాానికి హైప్ రాగా అదేక్రమంలో విడుదల చేసిన పాటలు, ట్రైలర్ అంతకుమించి అన్నట్టుగా ఉండి సినిమాపై అంచనాలను రెండింతలు పెంచేశాయి. సినిమా గురించి కొట్లాది మంది ఎదురు చూసేలా చేశాయి.

డిపెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి కూడా. ఇదిలాఉండగా థియేటర్లలో సినిమాల విడుదలకు ముందే చాలా ఓటీటీ ఫ్లాట్ ఫాంలు సదరు నిర్మాతలతో ముందస్తుగానే ఒప్పందాలు చేసుకోవడం అనవాయితీగా వస్తుంది. సినిమా రిలీజ్ అయ్యాక ఓటీటీ విడుదల తేదీని ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు యానిమల్ (Animal) సినిమా ఓటీటీ విడుదల విషయంలో మాత్రం అనవాయితీకి భిన్నంగా జరిగింది. చిత్రం థియేటర్లలోకి రాకముందే ఓటీటీలో ఏ రోజు వచ్చే డేట్ ను కూడా లాక్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.


అయితే ఓటీటీ సంస్థలు సినిమాలు థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకువస్తుండగా ఒక్కోసారి సినిమాకు వచ్చిన ఫలితాన్ని బట్టి అంతకన్నా ముందే తీసుకువస్తున్నాయి కూడా. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ యానిమల్ సినిమా డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల అవుతుండగా సరిగ్గా 8వారాల తర్వాత రిపబ్లిక్ డే రోజు జనవరి 26న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్(Netflix)లో ఈ యానిమల్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సామాజిక మాధ్యమాల్లో న్యూస్ వైరల్ అవుతున్నది.

Updated Date - 2023-11-30T16:24:33+05:30 IST