Agent: అఖిల్ సినిమా అప్పుడే వచ్చేస్తోంది ఓటిటి లోకి, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే...

ABN , First Publish Date - 2023-05-03T13:00:05+05:30 IST

సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో వచ్చిన 'ఏజెంట్' సినిమా ఇంకా విడుదల అయి వారం రోజులు కూడా కాకముందే ఓటిటి లో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తున్నారో కూడా చెప్పేసారు. ఇంతకీ ఎక్కడ, ఎప్పుడు అంటే...

Agent: అఖిల్ సినిమా అప్పుడే వచ్చేస్తోంది ఓటిటి లోకి, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే...
Agent

అఖిల్ అక్కినేని (AkhilAkkineni) ఎంతో నమ్మకంతో, ఆశతో, హైప్ తో విడుదల అయిన 'ఏజెంట్' #Agent మొదటి ఆట నుండే సినిమా పోయింది అన్న వార్త బయటకి వచ్చేసింది. సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించిన ఈ సినిమా, అనిల్ సుంకర (Anil Sunkara) తన ఎకె ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ (AK Entertainment) మీద నిర్మించాడు. అయితే విడుదల అయిన నాలుగు రోజులకే నిర్మాత అనిల్ సుంకర ఒక సంచలన ప్రకటన చేస్తూ, ఈ సినిమాకి చాలా పెద్ద తప్పు చేసాం, అది బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్ళటమే అంటూ ట్వీట్ చేసాడు.

akhilakkineniagent2.jpg

దీనితో అప్పటి వరకు అఖిల్ అక్కినేని ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ ఆగిపోయారు. పాపం అఖిల్ కి ఈ సినిమా ఒక బ్రేక్ ఇస్తుంది అని అనుకుంటే, అతని ఆశలు పాపం వమ్ము అయ్యాయి. ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా పెద్దగా పెట్టారు అని, సుమారు రూ.80 కోట్ల వరకు అయిందని ఒక టాక్ నడుస్తోంది. అలాగే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు కూడా రూ.37 కోట్ల వరకు ఇచ్చారని, కానీ ఇప్పుడు అందులో ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ పూర్తిగా ఇచ్చారో తెలియదని, అందుకని అది కూడా పెద్ద లాస్ అని అంటున్నారు.

ఈ సినిమా మొదటి రోజు మాట్నీ నుండే పడిపోయింది. ఎదో కొంచెం హైప్ వచ్చింది కాబట్టి, మార్నింగ్ షోస్ కొంచెం చూసారు, కానీ మధ్యాహ్నం ఆట నుండి బాగా బాడ్ టాక్ వచ్చి రెవిన్యూ పడిపోయింది. రెండో రోజు నుండి అసలు ఏమీ లేదు.

agent-akhilakkineni1.jpg

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని ఓటిటి లో కూడా తొందరగానే స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. సోనీ లివ్ (SonyLiv) లో ఈ సినిమా మే19న (StreamingonMay19) స్ట్రీమింగ్ అవుతోంది. ఇది అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోందని తెలిసింది. విడుదల అయినా మూడు వారాల్లోపే ఇలా ఒక పెద్ద సినిమా ఓటిటి లో ప్రసారం అవడం ఆసక్తికరం. ఈ సినిమాలో సాక్షి వైద్య (Sakshi Vaidya) కథానాయకురాలుగా డెబ్యూ చేసింది.

Updated Date - 2023-05-03T13:00:15+05:30 IST