Rare photo of Krishna and NTR: ఎన్టీఆర్‌తో సూపర్ స్టార్ కృష్ణ, ఏమి మాట్లాడుకుంటున్నారో.. ఫోటో వైరల్

ABN , First Publish Date - 2023-05-29T14:46:10+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి తారక రామారావు ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ ఏదో చెప్తుంటే కృష్ణ వింటున్నారు. ఇంతకీ దేని గురించి అంటారు, వాళ్లిద్దరూ తీయబోయే మల్టీ స్టారర్ సినిమా గురించి ఏమో..

Rare photo of Krishna and NTR: ఎన్టీఆర్‌తో సూపర్ స్టార్ కృష్ణ, ఏమి మాట్లాడుకుంటున్నారో.. ఫోటో వైరల్
NTR and Krishna from Devudu Chesina Manushulu film

సూపర్ స్టార్ కృష్ణ(SuperStarKrishna)కి, నందమూరి తారక రామారావు (NTRamaRao)కి ప్రత్యేక అనుబంధం #NTR వుంది. ఇద్దరికీ అప్పుడప్పుడూ కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చినా, ఇద్దరూ కూడా బాగా మాట్లాడుకుంటూ ఉండేవారని చెపుతూ వుంటారు. కృష్ణ.. ఎన్టీఆర్ అభిమాని (Krishna is a big fan of NTR). కృష్ణ ఏ సినిమా తీసినా ఎన్టీఆర్‌కి వీలయినప్పుడల్లా ముందుగా చూపిస్తూ ఉండేవారని అంటూ వుంటారు. అలాగే 'మోసగాళ్లకు మోసగాడు' #MosagallakuMosagadu సినిమా తీసినప్పుడు కూడా ఆయనకి చూపించారట కృష్ణ. చాలామంది ఈ సినిమా ప్రివ్యూ చూసి ఇదేమి సినిమా, ఇది నడవదు, ఆడదు అని చెప్పారట.

కానీ ఎన్టీఆర్ ఈ సినిమా చూసి, సినిమా చాలా బాగుంది బ్రదర్, పెద్ద హిట్ అవుతుంది కానీ సినిమాకి మహిళా ప్రేక్షకులు, తక్కువ వస్తారు అని చెప్పారట. అయన అన్నట్టుగానే సినిమా చాలా పెద్ద హిట్ అయింది, కానీ ఆ సినిమాకి మహిళా ప్రేక్షకులు ఎక్కువ రాలేదుట. ఎందుకంటే అది కౌబాయ్ సినిమా, భారత దేశంలో మొదటిసారిగా కౌబాయ్ సినిమా తీసిన ఘనత కృష్ణ ఆ సినిమాతో సంపాదించారు. ఈ సినిమాని రాజస్థాన్ లోని థార్ ఎడారిలో షూటింగ్ చేశారని చెపుతూ ఉండేవారు.

superstarannagaru.jpg

అది ఎన్టీఆర్‌కి, కృష్ణకి వున్న అనుబంధం. అలాగే 'పండంటి కాపురం' #PandantiKapuram సినిమా కూడా చూపిస్తే, ఇది బ్రహ్మాండమైన హిట్ అవుతుందని చెప్పారట ఎన్టీఆర్. అదే సినిమా శతదినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా పిలిచారు కృష్ణ. ఆ వేడుకలోనే తన అభిమాన నటుడు ఎన్టీఆర్ ఒప్పుకుంటే అతనితో సినిమా తీస్తాను అని చెప్పారట కృష్ణ. వెంటనే ఎన్టీఆర్ అదే సభలో వొప్పుకున్నారట. అలా ఆ ఇద్దరూ కలిపి నటించిన సినిమా 'దేవుడు చేసిన మనుషులు'. #DevuduChesinaManushulu

Updated Date - 2023-05-29T15:02:37+05:30 IST