SriSri: నా అక్షరానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ: శ్రీ శ్రీ

ABN , First Publish Date - 2023-04-30T13:55:52+05:30 IST

'ఈ శతాబ్దం నాది' అంటూ శ్రీశ్రీ గా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు (30 ఏప్రిల్ 1910 - 15 జూన్ 1983) గారి పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న వ్యాసం

SriSri: నా అక్షరానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ: శ్రీ శ్రీ
Mahakavi Sri Sri

'ఈ శతాబ్దం నాది' అని సగర్వం గా చెప్పుకున్న శ్రీశ్రీ గారి పుట్టినరోజు ఈరోజు అని అంటారు. శ్రీశ్రీ గారి జీవితచరిత్ర 'అనంతం' #Anantham లో అయితే అయన తన పుట్టిన తేదీ తనకే తెలీదు అని రాసుకున్నారు. స్కూల్ లో శ్రీ శ్రీ నాన్నగారు వయసు పెరగటం కోసం 2-1-1910 అని రాయించారు అని రాసుకున్నారు. కానీ తను పుట్టింది 1910, ఏప్రిల్ నెల అని తెలుసు కానీ తేదీ అయితే తెలియదు అని రాసుకున్నారు శ్రీశ్రీ గారు తన జీవితచరిత్రలో. చివరికి ఏప్రిల్ 30 అని నిర్ణయించేశారు. #SriSriJayanthi

శ్రీశ్రీ గారు చాలా సినిమాలకు చాలా పాటలు రాసారు. అందులో 'అల్లూరి సీతారామరాజు' సినిమాకి #AlluriSeetharamaRaju తెలుగు వీర లేవరా పాటకి గాను శ్రీశ్రీ గారికి జాతీయ అవార్డు వచ్చింది. #TeluguLiterature మొదటి సారిగా జాతీయ స్థాయిలో #SriSri తెలుగు పాటకి అవార్డు తెచ్చిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ. అప్పట్లో కొంచెం విప్లవ పాటలు రాయాలంటే శ్రీశ్రీ గారి దగ్గరికే వెళ్లేవారు, ఎందుకంటే అయన కమ్యూనిస్ట్ భావాలు వుండే వ్యక్తి, అలాగే ఆధునిక కవిత్వానికి ద్రష్ట. అటువంటి శ్రీశ్రీ ఎక్కువ విప్లవ గీతాలు రాసేవారు సినిమాలో కూడా.

అవొక్కటే కాదండోయ్, మామూలు హుషారు పాటలు కూడా చాలా రాశారు శ్రీశ్రీ గారు. #SrirangamSrinivasaRao 'జోరుగా హుషారుగా షికారు పోదుమా' అని 'భార్యాభర్తలు' సినిమాలో రాశారు, అలాగే 'మనసున మనసై..బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము..' అని 'డాక్టర్ చక్రవర్తి' లో కూడా రాసారు. అలాగే మంచి హుషారయినా 'ఓ రంగయో పూల రంగయో ఓర చూపు చాలించి సాగిపోవయో' అంటూ 'వెలుగు నీడలు' లో రాశారు. శ్రీశ్రీ పెన్నుకీ అన్ని పక్కలా పదునే #SuperStarKrishna ఎందుకంటే అతను కమ్యూనిస్ట్, దేవుడు, దెయ్యాల్ని నమ్మడు, విప్లవ కవి అని చాలామంది అనుకున్నా, అతని పెన్ను అన్ని రకాల పాటలకు పదును పెట్టింది. 'ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సొగసరీ, చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతునో గడుసరి' అంటూ 'నర్తనశాల' సినిమాలో ఉత్తర, అభిమన్యుల ప్రేమ గీతం రాశారు.

అలాగే ఒక మంచి భావార్ధం, బద్ధకంగా వుండే మనిషిని జాగృతం చేసే పాట 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా' అంటూ 'భూమి కోసం' సినిమాకి రాశారు. 'పాడిపంటలు' లో 'పని చేసే రైతన్న పాటు పడే కూలన్నా' అంటూ మామూలు జనల కోసం రాసిన పాట, అలాగే మాంగల్య బలంలోని ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ అంటూ చందమామ మీద రాసిన పాట ఇలా ఒకదానికొకటి వైవిధ్యం వున్న పాటలు రాయటం ఒక్క శ్రీశ్రీకే చెల్లును.

ఒకపక్క ఇలాంటివి రాస్తూనే 'జయభేరి' సినిమాలో 'నందుని చరితము వినుమా పరమానందము గనుమా... ' అంటూ ఒక భక్తి పాట కూడా రాశారు. శ్రీశ్రీ గారు సుమారుగా వెయ్యికి పైగా పాటలు రాసి భారతదేశంలోని ఉత్తమ చలనచిత్ర పాటల రచయితలలో ఒకడుగా ప్రసిద్ధి చెందారు. 'ఈ శతాబ్దం నాది' అని సగర్వంగా చెప్పుకున్నాడు, ఆలా చాటి చెప్పగల వ్యక్తి ఎవరయినా వున్నారు అంటే అది ఒక్క శ్రీశ్రీ నే. అయన ఏ పాట రాసిన అందులో సగటు మనిషి ఆవేదన, సగటు మనిషిని దృష్టిలో పెట్టుకునే రాస్తారు అన్నట్టుగా ఉంటాయి అయన గీతాలన్నీ.

alluriseetharamaraju.jpg

సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో కూడా శ్రీశ్రీ గారు ఎక్కువ పాటలు రాసారు. కృష్ణ తీసిన 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో 'తెలుగు వీర లేవరా' పాటకి జాతీయ అవార్డు వస్తే, అతనే తీసిన ఇంకో సినిమా 'కురుక్షేత్రం' సినిమాలో 'కురుక్షేత్రం ఇది ధర్మక్షేత్రం' అంటూ ఒక అద్భుతమైన పాటని కురుపాండవ సైన్యాన్ని వర్ణిస్తూ రాశారు శ్రీశ్రీ గారు. అతను విప్లవ కవి అయినా కవిత్రయం రాసిన 'ఆంధ్ర మహాభారతం' ని ఔపాసన పట్టిన వ్యక్తి. అలాగే విశ్వనాథ సత్యనారాయణ అంటే ఏంటో ఇష్టం శ్రీశ్రీ గారికి.

WhatsApp Image 2023-04-30 at 06.57.31.jpeg

ఇలాంటి శ్రీశ్రీ కృష్ణ గురించి ఏమన్నారో తెలుసా, "నేను ఒక అక్షరం రాసిన దానికి కూడా విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ" అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు శ్రీశ్రీ. ఒక్క సినిమా పాటలే కాదు ఎన్నో రచనలు చేసిన శ్రీశ్రీ కవిత సంపుటిలో 'మహా ప్రస్థానం' మరువలేనిది. ఏ తరం వారికయినా అది చదివి తీరాల్సిందే.

Updated Date - 2023-04-30T13:57:44+05:30 IST