ఈ ఫోటోలో వున్న నటుడుని గుర్తు పట్టారా? ఇప్పుడు అతను ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2023-05-04T11:24:44+05:30 IST

ఈ ఫోటోలో వున్న వ్యక్తి హీరో అవుదామని తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. చాల కష్టపడ్డాడు, శ్రమించాడు, హీరో అవ్వలేకపోయాడు, కానీ పెద్ద దర్శకుడు అయ్యాడు, తను అంటే ఏంటో, తన ప్రతిభ ఏంటో చూపించాడు

ఈ ఫోటోలో వున్న నటుడుని గుర్తు పట్టారా? ఇప్పుడు అతను ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
Please identify the person in the above photo

పై ఫోటోలో వున్న ఆ నటుడు ఎవరో గుర్తు పట్టారా? చాలామంది గుర్తు పట్టకపోవచ్చు, ఎందుకంటే అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అప్పట్లో అతను నూనూగు మీసాలతో, మంచి యవ్వనంలో వున్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి వచ్చాడు. లీడ్ యాక్టర్ అవుదామని కష్టపడ్డాడు, పరిశ్రమలో అందరి దగ్గరా తిరిగాడు. కానీ అతని కష్టం ఫలించలేదు, అతను హీరో అవ్వలేకపోయాడు. అసలు నటుడు గానే కొనసాగలేకపోయాడు. ఎదో ఒకటి రెండు సినిమాల్లో చేసాడు.

అయితే అతని కష్టపడే మనస్తత్వం వూరికే పోదు కదా, అందుకే అతను పరిశ్రమని అయితే వదల్లేదు. నటుడుగా రాణించాలి అనుకొని వచ్చాడు, నటుడు కాలేకపోయాడు, కానీ అతని మీద అతనికి నమ్మకం వుంది, అతని టాలెంట్ మీద అతనికి నమ్మకం వుంది, అతనికి తెలుసు, ఎప్పటికయినా ఇదే పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంటానని. ఎందుకంటే ఎక్కడ నువ్వు మొదలెట్టావో, ఎక్కడ ఓడిపోయావో, అక్కడే మళ్ళీ మొదలెట్టి, అక్కడే గెలవాలి అన్నది అతని సిద్ధాంతం.

అందుకే వదిలిపెట్టకుండా, వేరే రంగంలో కృషి చేసాడు. అతనికి మనీషా ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఆసరా ఇచ్చింది. అంతే ఒక్కసారిగా విజృంభించాడు. అతనెవరో కదండీ! మన ఎస్ వి కృష్ణా రెడ్డి. ఆ స్టిల్ 'పగడాల పడవ' అనే సినిమాలోది. ఆ తరువాత చిరంజీవి నటించిన 'కిరాతకుడు' లో కూడా ఒక చిన్న పాత్ర చేసాడు కృష్ణా రెడ్డి.

svkrishnareddy.jpg

ఈరోజు ఒక తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం సంపాదించిన దర్శకుల్లో కృష్ణా రెడ్డి ఒకరు. 'రాజేంద్రుడు గజేంద్రుడు' తో దర్శకత్వం మొదలయి, ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు కృష్ణా రెడ్డి. అసలు గుర్తుపట్టలేకుండా వున్నారు కదా అప్పటికి, ఇప్పటికి.

Updated Date - 2023-05-04T13:23:38+05:30 IST