కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి.. నివాళులర్పించిన మహేష్ బాబు

ABN, First Publish Date - 2023-11-15T18:08:41+05:30

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందరికి గుర్తుండిపోయే పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు మహేష్ బాబు ఘనంగా నివాళులు అర్పించారు. మహేష్ బాబుతో పాటు ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులందరూ సూపర్ స్టార్ కృష్ణతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Superstar Krishna First Remembrance Day

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందరికి గుర్తుండిపోయే పేరు సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna). ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు మహేష్ బాబు (Mahesh Babu) ఘనంగా నివాళులు అర్పించారు. మహేష్ బాబుతో పాటు ఘట్టమనేని ఫ్యామిలీ (Ghattamaneni Family) సభ్యులందరూ సూపర్ స్టార్ కృష్ణతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. (SSKForever)

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాకు నిఘంటువు. ఘట్టమనేని శివరామకృష్ణగా కెరీర్ మెుదలు పెట్టి సూపర్ స్టార్​గా కృష్ణ ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అలాంటి మహానీయుడు మరణించి నేటి(బుధవారం)తో ఏడాది అయిన సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు పలుచోట్ల ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. (Superstar Krishna First Remembrance Day)


కృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొన్నారు. నమ్రత, మహేష్ తనయుడు గౌతమ్, అశోక్ గల్లా వంటి వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొని సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి ఫొటోలకు పూలు సమర్పించి.. నమస్కరించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు తనకు ఎంతో ఇష్టమైన తన తండ్రి ఫొటోని సోషల్ మీడియాలో షేర్ ఎప్పటికీ మీరే మా సూపర్ స్టార్ అని రాసుకొచ్చారు. (SSKLivesON)


ఇవి కూడా చదవండి:

========================

*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లాడబోయే వ్యక్తి ఇతనే..

**********************************

*Mehreen Pirzada: అదే నాకు ‘స్పార్క్’ మూమెంట్‌..

**********************************

*Malavika Mohanan: అభిమానుల మనసుల్లో మాళవిక గిలిగింతలు

********************************

*Aishwarya Rai: ఐష్ టాయిలెట్స్ కడగడానికి కూడా ఆ క్రికెటర్ పనికిరాడంటూ.. నెటిజన్లు ఫైర్

*********************************

Updated Date - 2023-11-15T18:10:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!