GAMA Awards: దుబాయ్‌లో గామా టాలీవుడ్ మూవీ అవార్డ్స్.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Dec 19 , 2023 | 11:19 PM

నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా గామా నేషనల్ ఐకాన్ అవార్డ్ అందించాలని, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించడంతో పాటు 57 ఏళ్ల నేషనల్ అవార్డ్ చరిత్రలో జాతీయ స్థాయిలో మొట్టమొదటి సారి, ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు  అందుకున్న తెలుగు తేజం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి , వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదిక‌పై ప్రత్యేక సత్కారం చేయాలని భావిస్తున్నారు.

GAMA Awards: దుబాయ్‌లో గామా టాలీవుడ్ మూవీ అవార్డ్స్.. ఎప్పుడంటే?
Gama Awards 2024 Press Meet

దుబాయ్‌లో ప్రతి సంవత్సరం జరిగే గామా అవార్డ్స్ గల్ఫ్ తెలుగు సినీ అవార్డ్స్ చరిత్రలో ఒక ట్రెండ్ సృష్టించింది. అదే స్ఫూర్తి తో 2024 మార్చి 3న మరింత భారీగా గామా అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా గామా నేషనల్ ఐకాన్ అవార్డ్ అందించాలని, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించడంతో పాటు 57 ఏళ్ల నేషనల్ అవార్డ్ చరిత్రలో జాతీయ స్థాయిలో మొట్టమొదటి సారి, ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు  అందుకున్న తెలుగు తేజం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి , వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదిక‌పై ప్రత్యేక సత్కారం చేయాలని భావిస్తున్నట్లుగా గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు తెలియజేశారు.    

3 మార్చ్, 2024న దుబాయి లో జరగబోయే ఈ గామా అవార్డ్స్ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. 2021, 2022, 2023 సంవత్సరంలో ఉత్తమ చిత్రాలు, నటులు, దర్శకులు, సంగీతం విభాగాలలో ఈ గామా అవార్డ్స్ అందజేయనున్నట్టు, అదేవిధంగా, గామా స్థాపించినప్పటి నుండి.. గామా అవార్డు వేదికకు సహాయ, సహకారాలు అందిస్తూ.. అవార్డు ఫంక్షన్‌ను ప్రసారం చేస్తున్న ఈటీవీ యాజమాన్యానికి గామా అవార్డ్స్ CEO సౌరభ్ కేసరి తెలిపారు. ఆస్కార్ పురస్కారం అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌ల‌కు ప్రత్యేకంగా ‘గామా గౌరవ్ సత్కార్’తో పాటు, ప్రఖ్యాత గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా ‘గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు’ను గాయకులు మనోకి అందిస్తున్నామని  గామా అవార్డ్స్ దర్శకులు ప్రసన్న పాలంకి తెలియజేశారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు సుకుమార్(పుష్ప), బాబీ(వాల్తేరు వీరయ్య), బుచ్చిబాబు సానా(ఉప్పెన), మెగా బ్రదర్ నాగబాబు, వీ.ఎన్.ఆదిత్య, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, వైజయంతి మూవీస్ వారసురాళ్లు స్వప్నా దత్,  ప్రియాంక దత్(సీతారామం), DVV దానయ్య(RRR), TG విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), గీతా ఆర్ట్స్ సంస్థ, నిర్మాత బన్నీ వాసు, RRR టీం, పుష్ప టీం, సీతారామం టీం, భగవంత్ కేసరి టీం.. సంగీత దర్శకులు డా. కోటి, DSP, SS తమన్, MM శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్, హేషం అబ్దుల్ వహాబ్.. గాయకులు మనో, ధనుంజయ్.. తెలుగు సినిమాకి ఆస్కార్ ఖ్యాతి నందించిన లెజెండ్ ఎమ్.ఎమ్.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఇంకా ఎందరో సినీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, గాయనీ గాయకులు, కమెడియన్లు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. యాంకర్ సుమ, హైపర్ ఆది నిర్వహణలో టాలీవుడ్ గాయనీ గాయకులతో పాటు, అందాల తారలు మరియు టీవీ కళాకారులు నిర్వహించే సంగీతం, నృత్యాలు, కామెడీ స్కిట్స్ వంటి వినోద కార్యక్రమాలతో పాటు గల్ఫ్ లోని స్థానిక ప్రత్యేక వినోద కార్యక్రమాలు 10వేల మందికి పైగా ప్రేక్షకుల సాక్షిగా అలరించబోతున్నట్టు  గామా అవార్డ్స్ జ్యూరీ సభ్యులు మరియు గౌరవ సలహాదారుడైన దర్శకుడు VN ఆదిత్య తెలిపారు.         

2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలనుంచి - బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్, వంటి వివిధ కేటగిరీల నామినేషన్ సాధించిన వారికి ఆన్‌లైన్ ఓటింగ్, మీడియా రిపోర్ట్స్, గామా జ్యూరీ ఛైర్ పర్సన్‌గా నేను, శ్రీలేఖ, దర్శకులు VN ఆదిత్య  నిర్ణయించిన విజేతలకు గామా అవార్డ్స్ తో సత్కరించడం జరుగుతుందని, ఈ గామా అవార్డ్స్ మరో ఆస్కార్, గ్రామీ అవార్డ్స్ స్థాయికి చేరుకోవాలని మ్యూజిక్ డైరెక్టర్ డా. కోటి ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా అవార్డ్స్ కార్యక్రమంలో తెలుగు సినిమా ప్రాముఖ్యత లేకపోవడం చూసి, తెలుగు సినిమాకి, సినిమా సంగీతానికి అంతర్జాతీయ స్థాయిలో సరైన గుర్తింపు లభించాలన్న తలంపుతో గామా అవార్డ్స్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. గతంలో 3 సార్లుగా జరిగిన ఈ గామా అవార్డ్స్ వేడుకలకు అతిధిగా వెళ్ళానని.. ఎంతో వైభవంగా గామా అవార్డ్స్ జరుగుతాయని. మళ్లీ ఈసారి జ్యూరీ సభ్యురాలిగా వెళ్ళడం ఆనందంగా ఉందని MM శ్రీలేఖ అన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 11:19 PM