Alia Bhatt-Ranbir Kapoor: భార్యాభర్తల చిత్రాలు క్లాష్

ABN, First Publish Date - 2023-01-19T19:46:45+05:30

బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) లు గతేడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ పండంటి బుజ్జాయి కూడా ఉంది.

Alia Bhatt-Ranbir Kapoor:  భార్యాభర్తల చిత్రాలు క్లాష్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) లు గతేడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ పండంటి బుజ్జాయి కూడా ఉంది. ఆలియా, రణ్‌బీర్‌లు నటించిన వేర్వేరు చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండింటిలో ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

ఆలియా భట్ హాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ (Heart Of Stone) అనే చిత్రంలో నటించింది. గల్ గడోట్, జామీ డోర్నాన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 11నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని ఓటీటీ ప్లాట్‌ఫామ్ తాజాగా ప్రకటించింది. సేవ్ ద డేట్ టైటిల్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో భాగంగానే సినిమా ఆగస్టు 11న స్ట్రీమింగ్ కానున్నట్టు తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అదే రోజు రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ (Animal) రిలీజ్ కానుంది. ఈ చిత్రానికీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కింది. ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘యానిమల్’ పై భారీ అంచనాలున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆ అంచనాలను మరింత పెంచేసింది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ను టామ్ హార్పర్ తెరకెక్కించాడు. ఆలియా ఈ మూవీతోనే హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో భారీ ఆశలు పెట్టుకుంది.

Updated Date - 2023-01-19T19:46:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!