Samantha: ఫస్ట్‌ హాలీవుడ్‌ మూవీ.. కథేంటో తెలుసా ?

ABN , First Publish Date - 2023-05-31T14:17:49+05:30 IST

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు సమంత. ఇప్పుడు మరో సిరీస్‌ ‘సిటాడెల్‌’తో మరింత అలరించేందుకు ప్రయత్నిస్తోంది. అంతే కాకుండా సామ్‌ హాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది.

Samantha: ఫస్ట్‌ హాలీవుడ్‌ మూవీ..  కథేంటో తెలుసా ?

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ (The Family man) సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు సమంత (Samantha). ఇప్పుడు మరో సిరీస్‌ ‘సిటాడెల్‌’తో (Citadel)మరింత అలరించేందుకు ప్రయత్నిస్తోంది. అంతే కాకుండా సామ్‌ హాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘చెన్నై స్టోరీ’ (Chennai story)అనే పేరు ఖరారైనట్లు నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. బాఫ్టా పురస్కార గ్రహీత ఫిలిప్‌ జాన్‌ (Philip John) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విల్‌ మచిన్‌ నిర్మాత. లండన్‌లో స్థిరపడ్డ భారతీయ మూలాలున్న ఒక ఇంగ్లీష్‌ యువకుడు నిఖిల్‌ (వివేక్‌ కల్రా) తన తండ్రిని వెతుక్కుంటూ చెన్నై వస్తాడు. అక్కడ తనకి అను (సమంత) పరిచయం అవుతుంది. నిఖిల్‌ తండ్రిని వెతకడానికి సాయం చేయడానికి ఆమె ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది అన్న ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కే ఈ చిత్రంలో సమంతకి జోడీగా వివేక్‌ కల్రా నటించనున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ చెన్నై, బ్రిటన్‌లో ఉంటుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. తూర్పు, పశ్చిమ దేశాల సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ చిత్ర షూటింగ్‌ చెన్నై, బ్రిటన్‌లలో ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. సమంత నటిస్తున్న తొలి ఇంగ్లిష్‌ చిత్రమిది. ఇంగ్లీష్‌, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత తెలుగులో ‘ఖుషి’ (Kushi) చిత్రం చేస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కోసం సమంత, విజయ్‌ దేవరకొండ, చిత్ర బృందం టర్కీ పయనమయ్యారు. సామ్‌ అక్కడ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసి ‘స్టిల్‌ డ్రీమింగ్‌’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2023-05-31T14:18:50+05:30 IST