సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Priyanka Chopra Daughter: ఎంత క్యూట్‌గా ఉందో చూశారా.. ప్రియాంక కూతురి పిక్ వైరల్

ABN, First Publish Date - 2023-01-31T11:39:46+05:30

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటిమణుల్లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఒకరు.

Priyanka chopra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటిమణుల్లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఒకరు. ఇక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలోనే హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ సైతం తనదైన ముద్ర వేసింది. అయితే ఈ బ్యూటీ కొన్నేళ్ల క్రితం హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రియాంక కంటే నిక్ వయస్సులో 10 ఏళ్లు చిన్నవాడు కావడంతో అప్పట్లో వారి పెళ్లి విషయంలో పెద్ద చర్చ జరిగింది. అనంతరం కొన్ని సంవత్సరాల క్రితం ఈ జంటకి సరోగసీ ద్వారా ఓ కూతురు (Daughter) జన్మించింది. ఆ పాపకి ఇద్దరి సంప్రదాయాలు కలిసేలా మాల్తి మేరీ (Malthi Marie) అని పేరు పెట్టుకున్నారు.

అయితే.. అప్పటి నుంచి ఎన్నోసార్లు కూతురితో వారిద్దరూ ఉన్న పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ.. వాటిలో మాల్తి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా మాల్తికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే జరిగిన ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్’కి నిక్, ప్రియాంక జంట కూతురితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఓ పిక్‌ని ప్రియాంక ఫ్యాన్ పేజీలో షేర్ చేశారు. ఆ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో ఎంతోమంది నెటిజన్లు చాలా క్యూట్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-01-31T11:39:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!