Avatar2: ‘టైటానిక్’ ను బీట్ చేసిన ‘అవతార్ 2’

ABN , First Publish Date - 2023-02-20T20:38:51+05:30 IST

‘టైటానిక్’ (Titanic) డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar2). ఈ మూవీ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Avatar2: ‘టైటానిక్’ ను బీట్ చేసిన ‘అవతార్ 2’

‘టైటానిక్’ (Titanic) డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar2). ఈ మూవీ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 160భాషల్లో విడుదల అయింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది. ‘టైటానిక్’ (Titanic) కలెక్షన్స్‌ను తాజాగా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ బీట్ చేసింది.

‘అవతార్ 2’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 2,243 మిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టింది. ‘టైటానిక్’ కలెక్షన్స్‌ను బీట్ చేసింది. ‘టైటానిక్’ పూర్తి రన్‌లో 2,242.8మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ప్రస్తుతం రాబట్టిన వసూళ్లతో ‘అవతార్ 2’ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగా రికార్డు సృష్టించింది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అమెరికాలో 1,586 మిలియన్ డాలర్స్‌ను రాబట్టగా, ఇతర దేశాల్లో 657మిలియన్ డాలర్స్‌ను కొల్లగొట్టింది. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, ఎస్తోనియా, హంగేరి, లాత్వియా, లెబనాన్, లిథువేనియా, నార్వే, పొర్చుగల్, న్యూజిలాండ్, కొలంబియాతో పాటు మరికొన్ని దేశాల్లో ‘అవతార్ 2’ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ మూవీస్‌లో మొదటి నాలిగింటిని పరిగణనలోకి తీసుకుంటే మూడు చిత్రాలు జేమ్స్ కామెరూన్‌వే ఉండటం చెప్పుకోదగ్గ విశేషం.

‘అవతార్’ 2009లో విడుదలైంది. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 2.97బిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. మూవీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ‘అవతార్ 2’ లో శామ్ వర్తింగ్‌టన్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్‌స్లేట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-02-20T20:43:29+05:30 IST