MAD MAX: యాక్షన్, అడ్వెంచ‌ర్‌ ప్రియుల‌కు పండ‌గే.. అదిరిపోయిన ‘మాడ్ మాక్స్’ కొత్త సినిమా ట్రైల‌ర్

ABN , Publish Date - Dec 01 , 2023 | 03:51 PM

హాలీవుడ్ సినిమాలంటే సగటు సినీ ప్రేక్షకులకు ఉండే క్రేజే వేరు. అందులోనూ యాక్షన్, సర్వైవల్ చిత్రాలైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. వాటికంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది, ముఖ్యంగా మ్యాడ్ మ్యాక్స్ లాంటి డిస్టోపియన్ యాక్షన్ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కోవలోనే తాజాగా రాబోతున్న చిత్రం ఫ్యూరియోసా: ఎ మాడ్ మాక్స్ సాగా అఫీసియల్ ట్రైలర్ ఈ రోజు (డిసెంబర్1)న విడుదలై జనాలను ఆకట్టుకుంటున్నది.

MAD MAX: యాక్షన్, అడ్వెంచ‌ర్‌ ప్రియుల‌కు పండ‌గే.. అదిరిపోయిన ‘మాడ్ మాక్స్’ కొత్త సినిమా ట్రైల‌ర్
madmax

హాలీవుడ్ సినిమాలంటే సగటు సినీ ప్రేక్షకులకు ఉండే క్రేజే వేరు. అందులోనూ యాక్షన్, సర్వైవల్ చిత్రాలైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. వాటికంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది, సినిమాలకు వీపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా మ్యాడ్ మ్యాక్స్ లాంటి డిస్టోపియన్ యాక్షన్ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కోవలోనే తాజాగా రాబోతున్న చిత్రం ఫ్యూరియోసా: ఎ మాడ్ మాక్స్ సాగా (FURIOSA : A MAD MAX SAGA) అఫీసియల్ ట్రైలర్ ఈ రోజు (డిసెంబర్1)న విడుదలై జనాలను ఆకట్టుకుంటున్నది.

1979లో మొదటిసారిగా MAD MAX పేరుతో ఈ అస్ట్రేలియన్ పోస్ట్-అపోకలిప్టిక్ డిస్టోపియన్ జానర్ లో ప్రారంభమైన ఈ ఫ్రాంఛైజీలో ఆ తర్వాత 1981లో మ్యాడ్ మ్యాక్స్2 (ది రోడ్ వారియర్) 1985లో మ్యాడ్ మ్యాక్స్3 ( బీ హైండ్ థండర్ స్ట్రోమ్), 2015లో మ్యాడ్ మ్యాక్స్ (ఫ్యూరీ రోడ్) అనే నాలుగు భాగాలుగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా అలరించింది. ఈ క్రమంలో ఇప్పుడు 5వ భాగం ఫ్యూరియోసా: ఎ మాడ్ మాక్స్ సాగా (FURIOSA : A MAD MAX SAGA) ఫ్రీక్వెల్ త్వరలో రాబోతున్నది. ఈ చిత్రాలన్నింటికీ అస్ట్రేలియన్ రచయిత, నిర్మాత జార్జ్ మిల్లర్ (George Miller) దర్శకత్వం చేశారు.


ఈ సిరీస్ లో వచ్చిన మొదటి మూడు భాగాల్లో మెల్ గిబ్సన్ కథానాయకుడిగా నటించగా నాలుగో భాగం ప్యూరీ రోడ్ లో వీనమ్ సినిమాలతో బాగా పాపులర్ అయిన టామ్ హర్డీ(Tom Hardy) నటించాడు. ఇక రాబోతున్న ఐదవ భాగంలో థోర్, ఎక్స్ ట్రాక్షన్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన క్రిస్ హెమ్ వర్త్(Chris Hemsworth) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రముఖ హీరోయిన్స్ ఆన్యా టేలర్(Anya Taylor) ఛార్లస్ థెరాన్ (Charlize Theron) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా 4వ పార్ట్ ప్యూరీ రోడ్ కు ఫ్రీక్వెల్ గా రానుండగా సీక్వెల్ మ్యాడ్ మ్యాక్స్ (ది వేస్ట్ ల్యాండ్) Mad Max: The Wasteland త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

అయితే ఈ రోజు విడుదలైన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. 2015లో వచ్చిన 4వ భాగం ప్యూరీ రోడ్ లో ప్రధాన పాత్ర అయిన ఫ్యూరియోసా (ఛార్లెస్ థెరాన్) Charlize Theron ఈ రోడ్ వార్ లోకి ఎలా వచ్చింది, కింగ్ నుంచి ఐదుగురు భార్యలను ఎందుకు రక్షించిందనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని అంతకు ముందు వచ్చిన చిత్రాలను తలదన్నే అడ్వెంచర్స్, యాక్షన్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా 2024 మే 24 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అప్పటిదాకా ఈ ఫ్రాంచైజీ అభిమానులు కాస్తా ఓపిక పట్టక తప్పదు. అప్పటివరకు ఈ ట్రైలర్ తో సరిపెట్టుకోండి.

Updated Date - May 22 , 2024 | 04:17 PM