Oscars95 Winners Full List: ఈ ఏడాది అకాడమీ అవార్డ్స్ విజేతలు వీరే.. అత్యధికంగా ఆ చిత్రానికే..

ABN , First Publish Date - 2023-03-13T11:03:10+05:30 IST

సినీ ప్రపంచం మొత్తం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్స్ ఆస్కార్స్ (Oscars).

Oscars95 Winners Full List: ఈ ఏడాది అకాడమీ అవార్డ్స్ విజేతలు వీరే.. అత్యధికంగా ఆ చిత్రానికే..

సినీ ప్రపంచం మొత్తం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్స్ ఆస్కార్స్ (Oscars). ప్రతి సినీ సెలబ్రిటీ ఈ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ అవార్డుని అందుకోవాలని కోరుకుంటారు. అంతటి విలువున్న ఈ అవార్డుల వేడుక కోసం సినీ ప్రేమికులందరూ గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చేసింది. 95వ అకాడమీ అవార్డుల (95th Academy awards) వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డుల్లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ఆల్ క్వై‌ట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్‌ ఎక్కువ అవార్డులను గెలుచుకున్నాయి. అలాగే.. భారతదేశానికి సైతం రెండు అవార్డులు దక్కాయి. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ఓరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ (Naatu Naatu) ఈ అవార్డుని సొంతం చేసుకున్నాయి. అలాగే.. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మూవీ అత్యధికంగా ఏడు అవార్డులు గెలుచుకోవడం విశేషం. కాగా.. 95 అకాడమీ అవార్డులు గెలుచుకున్న చిత్రాల పూర్తి జాబితా చూద్దాం.. (Oscars 2023)

యానిమేటెడ్ ఫీచర్

గిల్లెర్మో డెల్ టోరోస్ పినోకియో

సహాయ నటుడు

కే హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

సహాయ నటి

జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

డాక్యుమెంటరీ ఫీచర్

నవల్నీ

లైవ్-యాక్షన్ షార్ట్

ఏ ఐరిష్ గుడ్‌బై

సినిమాటోగ్రఫీ

ఆల్ క్వై‌ట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్‌

మేకప్ అండ్ హెయిర్

ది వేల్

కాస్ట్యూమ్ డిజైన్

బ్లాక్ పాంథర్: వాకండా ఫరెవర్

ఇంటర్నేషన్ ఫిల్మ్

ఆల్ క్వై‌ట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్‌

డాక్యుమెంటరీ షార్ట్

ది ఎలిఫెంట్ విస్పరర్స్

యానిమేటెడ్ షార్ట్

ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్

ప్రొడక్షన్ డిజైన్

ఆల్ క్వై‌ట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్‌

ఓరిజినల్ స్కోర్

ఆల్ క్వై‌ట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్‌

విజువల్ ఏఫెక్ట్స్

అవతార్: ది వే ఆఫ్ వాటర్

ఒరిజినల్ స్క్రీన్ ప్లే

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

ఉమెన్ టాకింగ్

సౌండ్

టాప్ గన్: మావెరిక్

ఓరిజినల్ సాంగ్

నాటు నాటు (RRR)

ఎడిటింగ్

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

ఉత్తమ దర్శకుడు

డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

ఉత్తమ నటుడు

బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్)

ఉత్తమ నటి

మిచెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

ఉత్తమ చిత్రం

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

Updated Date - 2023-03-13T11:03:12+05:30 IST