Jason Statham: పాల‌స్తీనాకు మ‌ద్ద‌తు ప‌లికిన హాలీవుడ్ స్టార్.. నిజ‌మేనా

ABN , First Publish Date - 2023-10-26T15:24:21+05:30 IST

జాస‌న్ స్నాత‌మ్(Jason Statham) ఈ పేరు తెలియ‌ని వారుంటారేమో గానీ మ‌నిషి తెలియ‌ని వారుండ‌రు. ట్రాన్స్‌పోర్ట‌ర్(The Transporter), డెత్‌ రేస్‌, ది మెగ్‌ సిరిస్ చిత్రాల ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించిన ఈ స్టార్‌ హీరో హాలీవుడ్ టాప్ టెన్ హ‌య్యెస్ట్ పేయింగ్, బీజీ న‌టుల్లో ఒక‌రు. ఈయ‌న‌కుంటూ ప్రతీ దేశంలో ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ హీరో గారి పేరు సోష‌ల్ మీడియాలో మారు మ్రోగిపోతున్న‌ది.

Jason Statham: పాల‌స్తీనాకు మ‌ద్ద‌తు ప‌లికిన హాలీవుడ్ స్టార్..  నిజ‌మేనా
Jason Statham

జాస‌న్ స్నాత‌మ్(Jason Statham) ఈ పేరు తెలియ‌ని వారుంటారేమో గానీ మ‌నిషి తెలియ‌ని వారుండ‌రు. ట్రాన్స్‌పోర్ట‌ర్(The Transporter), డెత్‌ రేస్‌, ది మెగ్‌ సిరిస్ చిత్రాల ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించిన ఈ స్టార్‌ హీరో హాలీవుడ్ టాప్ టెన్ హ‌య్యెస్ట్ పేయింగ్, బీజీ న‌టుల్లో ఒక‌రు. ఈయ‌న‌కుంటూ ప్రతీ దేశంలో ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ హీరో గారి పేరు సోష‌ల్ మీడియాలో మారు మ్రోగిపోతున్న‌ది. అసలు సిస‌లు హీరో అని, ఇత‌న్ని చూసి మిగ‌తా న‌టులు నేర్చుకోవాలంటూ క్లాసులు పీకుతున్నారు. అయితే ఈ చ‌ర్చంతా అయ‌న న‌టించిన‌ సినిమా గురించో మ‌రేదో అనుకుంటే మ‌నం ప‌ప్పులో కాలేసినట్లే. అదంతా ఇజ్రాయిల్ పాల‌స్తీనా యుద్దం సంద‌ర్భంగా సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ ఫేక్ వీడియో పుణ్యం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే..

ప్ర‌తీకారంతో ర‌గిలిపోతున్న ఇజ్రాయిల్(Israel).. పాల‌స్తీనా(Palestine) గాజా(Ghaza)లోని హ‌మాస్ తీవ్ర‌వాదుల‌పై యుద్దాన్ని ప్ర‌క‌టించి గ‌డిచిన 15 రోజులుగా బాంబుల వ‌ర్షం కురిపిస్తున్న‌ది దాంతో అక్క‌డ తీవ్ర‌వాదుల‌తో పాటు సామాన్య ప్ర‌జానికం కూడా వంద‌ల సంఖ్య‌లో మ‌ర‌ణిస్తున్నారు. తిండి తిప్ప‌లు లేక అల‌మ‌టిస్తున్నారు. అయితే వారికి మ‌ద్ద‌తుగా చాలా దేశాలు మ‌ద్దుతు ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా వారికి తోచినంత న‌గ‌దు సాయం, మెడిస‌న్‌, ఆహ‌రం త‌దిత‌ర రూపాల్లో అందిస్తున్నాయి. మ‌న భార‌తదేశం కూడా ఇప్ప‌టికే భారీగా మందులు, ఫుడ్ పంపించి మిగ‌తా దేశాల‌క‌న్నా ముందు వ‌రుస‌లో ఉంది.

అయితే ఈ యుద్దాన్ని ఆపాల‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెళ్లువెత్తుతున్న క్ర‌మంలో చాలా మంది సెల‌బ్రిటీలు, ఆట‌గాళ్లు ముందుకు వ‌చ్చి పాల‌స్తీనాకు త‌మ‌ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్‌లోని ఓ న‌గ‌రంలో అచ్చుగుద్దినట్లు జాస‌న్ స్నాత‌మ్ పోలిక‌ల‌తో ఉన్న ఓ వ్య‌క్తి ఇజ్రాయిల్ యుద్దాన్ని వ్య‌తిరేకిస్తూ త‌న కారుపై పాల‌స్తీనా దేశ‌పు జెండాను అతికించుకుని ఆ వాహ‌నంపైనే తిరుగుతూ ఆ దేశానికి మ‌ద్ద‌తు తెలిపాడు. దాంతో అత‌ను హ‌లీవుడ్ స్టార్ యాక్ట‌ర్ జాస‌న్ స్నాత‌మ్ అని పాల‌స్తీనాకు మ‌ద్ద‌తు తెలుపుతున్నాడ‌ని ఇత‌న్ని చూసి హ‌లీవుడ్ న‌టులు త‌మ వాయిస్ కూడా బ‌య‌ట‌కు చెప్పాలంటూ ఆ వీడియోను నెటిజ‌న్స్‌ తెగ‌ వైర‌ల్ చేస్తున్నారు.


నిజం నిద్ర లేవ‌క‌ముందే అబ‌ద్దం ప్ర‌పంచ‌మంతా తిరిగొస్తుంద‌నే చందంగా స‌ద‌రు వీడియోపై ఆ హీరో నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో వీడియోలో ఉన్న‌ది ఆ హీరోనేనంటూ వీడియోను బాగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియో బాగా వైర‌లై మిలియ‌న్స్ ల‌లో వ్యూస్ వ‌స్తుండ‌డంతో వీడియోలో ఉన్న‌ది జాస‌న్ కాద‌ని, ఆయ‌న ఏ సోష‌ల్ మీడియాలోను పోస్టులు చేయ‌లేద‌ని ఆయ‌న స్నేహితులు స్ప‌ష్టం చేశారు. ఇదిలాఉండ‌గా ఈ వీడియో చూసిన వారంతా ఆయ‌న గురించి తెలుసుకోవ‌డానికి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవుతూ ఆయ‌న వీడియోల‌కు థ్యాంక్స్ చెబుతూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆ హీరోనే స్వ‌యంగా బ‌య‌టకు వ‌చ్చి రెస్పాండ్ అయితే గానీ నిజం బ‌య‌ట‌కు రాదు.

Updated Date - 2023-10-26T15:24:21+05:30 IST