Avatar 2: పండోరా లోకం ఇక మీ ఇంట్లో!

ABN , First Publish Date - 2023-03-08T16:21:08+05:30 IST

హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కెమెరూన్‌ (James Cameron) విజువల్‌ వండర్‌గా తెరకెక్కించిన ‘అవతార్‌ 2’ (Avatar2) . యావత్‌ సినీ ప్రపంచాన్ని అలరించింది.

Avatar 2: పండోరా లోకం ఇక మీ ఇంట్లో!

హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కెమెరూన్‌ (James Cameron) విజువల్‌ వండర్‌గా తెరకెక్కించిన ‘అవతార్‌ 2’ (Avatar2) . యావత్‌ సినీ ప్రపంచాన్ని అలరించింది. గత ఏడాది థియేటర్‌లలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్‌ ప్రేక్షకుల ముదుకు రానుంది. ఈ 28న ఈ చిత్రం డిజిటల్‌ స్ర్టీమింగ్‌ (Avatar 2 Digital streaming) కానుంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘అవతార్‌’ టీమ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘‘పండోరా లోకాన్ని మీ ఇంట్లోనే కూర్చుని చూడండి. మునుపెన్నడూ చూడని విశేషాలను మూడు గంటలపాటు చూేసందుకు రెడీ అవ్వండి’’ అని ట్వీట్‌ చేశారు. అమెజాన్‌ ప్రైమ్‌, యాపిల్‌ టీవీ, వుడు ఓటీటీ వేదికల్లో 4కె అల్ర్టా హెచ్‌డీ, డాల్బీ అట్‌మాస్‌ ఆడియోతో స్రీమ్‌ కానుంది 2009లో విడుదలైన ‘అవతార్‌’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. మొదటి భాగంలో పండోరా గ్రహంలోని సుందరమైన అటవీ, జీవరాశులు ప్రపంచం చుట్టూ సాగింది. ‘అవతార్‌2’ కథని ‘ది వే ఆఫ్‌ వాటర్‌’ అంటూ నీటి ప్రపంచంలోకి తీసుకెళ్లాడు జేమ్స్‌ కామెరూన్‌.

Updated Date - 2023-03-08T16:21:31+05:30 IST