సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sailesh Kolanu: వెంకటేశ్‌తో యంగ్ బ్యూటీ రొమాన్స్!

ABN, First Publish Date - 2023-01-11T20:52:19+05:30

టాలీవుడ్ స్టార్ హీరోల్లో వెంకటేశ్ (Venkatesh) ఒకరు. కొత్త రకం కథలు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. చివరగా ‘ఎఫ్ 3’ లో కనిపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ స్టార్ హీరోల్లో వెంకటేశ్ (Venkatesh) ఒకరు. కొత్త రకం కథలు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. చివరగా ‘ఎఫ్ 3’ లో కనిపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ‘ఓరి దేవుడా’ లో అతిథి పాత్రను పోషించారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో పడ్డారు. వెంకటేశ్‌కు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. అదేంటంటే..

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకటేశ్ నటించనున్నాడని తెలుస్తోంది. శైలేష్ చెప్పిన కథకు వెంకీ ఫిదా అయ్యారట. ఫిబ్రవరిలో షూటింగ్‌ను పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా ‘కెజియఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించనున్నారని సమాచారం అందుతుంది. ఈ ప్రాజెక్టును నిహారిక ఎంటర్ టైన్‌మెంట్ నిర్మించనుంది. శైలేశ్ కొన్ని రోజుల క్రితమే ‘హిట్: 2’ తో బంపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు కు భారీ లాభాలను పంచింది.

Updated Date - 2023-01-11T20:52:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!