Varun Lavanya Tripathi Marriage: వరుణ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే...

ABN , First Publish Date - 2023-06-01T12:13:01+05:30 IST

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ విదేశాల్లో ప్రయాణం ముగించుకొని ఈరోజు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని, వీరి నిశ్చితార్ధం తేదీ కూడా అప్పుడు ప్రకటించే అవకాశం ఉందని, మెగా కుటుంబం ఇంకో సంబరానికి సిద్ధం అవుతోందని తెలిసింది.

Varun Lavanya Tripathi Marriage: వరుణ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే...
Lavanya Tripathi and Varun Tej

మెగా బ్రదర్ నాగబాబు (MegaBrother) కుమారుడు (Nagababu) వరుణ్ తేజ్ (VarunTej), నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) ల పెళ్లి ముహూర్తం ఖరారయింది. అయితే దీనికి ముందుగా ఎంగేజ్మెంట్ చేసుకోవాలని రెండు కుటుంబాల వారు అనుకుంటున్నట్టుగా తెలిసింది. అందుకే ఆ ఎంగేజ్మెంట్ తేదీని ఈనెల 9 (June 9) వ తేదీగా అనుకుంటున్నారని కూడా తెలిసింది. వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి చాలా కాలం నుంచి ప్రేమలో వున్నారు. లావణ్య త్రిపాఠి నాగబాబు ఇంట్లో జరిగే వేడుకలకు హాజరవుతోంది కూడా.

ఈ నేపథ్యంలోనే చాలా సార్లు వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటున్నారు అనే వార్తలు గతంలో వైరల్ అయ్యాయి. అయితే అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆ వార్తలను ఖండించారు. అయితే ఈమధ్య మళ్ళీ వీళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అనే వార్త వైరల్ అయింది, కానీ ఈసారి వారిద్దరి వద్ద నుండి ఎటువంటి ఖండన రాలేదు. అందుకని ఈసారి వార్త నిజమే అని, ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు అంగీకరించాయని కూడా తెలిసింది. అందుకని ముందుగా జూన్ 9 న ఎంగేజ్మెంట్ జరుపుకోవాలని అనుకుంటున్నట్టుగా కూడా తెలిసింది.

varuntejlavanyatripathi1.jpg

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఈ నెల 9వ తేదీన అయ్యాక, ఆరోజే వీరిద్దరి వివాహం ఎప్పుడు జరగనుందని ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. #MegaFamily ఈ నిశ్చితార్ధం ఫంక్షన్ కి మెగా కుటుంబం నుండి అందరూ వచ్చే అవకాశం వుంది అని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi), సురేఖ (Surekha) దంపతులు, అలాగే రామ్ చరణ్ (RamCharan), ఉపాసన (Upasana), చిరంజీవి ఇద్దరు కుమార్తెలతో పాటు, అల్లు (AlluFamily) కుటుంబం కూడా హాజరవుతోందని తెలుస్తోంది.

విదేశీ పర్యటనలో వున్న వరుణ్ తేజ్, లావణ్యలు ఈరోజు రాత్రికి హైదరాబాద్ కు చేరుకుంటారని సమాచారం. వరుణ్ తేజ్ తాను రోమ్ లో ఉన్నట్టు ఒక ఫోటో ఇన్స్టా గ్రామ్ షేర్ చేశాడు, అలాగే లావణ్య కూడా ట్రావెల్ లో వున్నట్టుగా ప్రకటించింది. ఈ సమాచారం చాలు నెటిజన్లు కు, ఇంకా వాళ్ళు వీరిద్దరూ కలిసే ప్రయాణిస్తున్నట్టు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-01T12:13:01+05:30 IST