Varun Tej Bachelor party: వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ, పెళ్లి తేదీ కూడా ఖరారు, ఎక్కడో తెలుసా

ABN , First Publish Date - 2023-09-30T13:20:00+05:30 IST

మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి తో పెళ్ళికి సమాయత్తం అవుతున్నాడు. ఇప్పుడు తన స్నేహితులు అందరికీ బ్యాచిలర్ పార్టీ ఇచ్చే పనిలో వున్నాడు వరుణ్. అలాగే పెళ్ళికి తేదీ కూడా ఫిక్స్ చేసుకున్నాడు, పెళ్లి ఎక్కడ చెయ్యాలో కూడా నిర్ణయం తీసుకున్నాడు అని తెలిసింది.

Varun Tej Bachelor party: వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ, పెళ్లి తేదీ కూడా ఖరారు, ఎక్కడో తెలుసా
Varun Tej

మెగా కుటుంబంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కుమారుడు, నటుడు వరుణ్ తేజ్, (VarunTej) నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) తో కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వివాహానికి కూడా తేదీ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. దానికి ముందు వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ తన స్నేహితులు అందరికీ ఇస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం వరుణ్ తేజ్, స్పెయిన్ (Spain) లో తన స్నేహితులతో బ్యాచిలర్ పార్టీ లో వున్నాడని తెలిసింది.

SaiDharamTej-new.jpg

ఈ పార్టీ కి మెగా కుటుంబం నుండి సాయి ధరమ్ తేజ్, (SaiDharamTej) అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ (VaishnavTej) వెళ్లినట్టుగా కూడా తెలిసింది. సుమారు 40 మంది స్నేహితులు ఈ బ్యాచిలర్ పార్టీ కి హాజరయినట్టుగా తెలిసింది. ఈమధ్యనే వరుణ్ తేజ్, చెల్లెలు నిహారిక (NiharikaKonidela), తల్లిందండ్రులతో విదేశాలకు వెళ్లిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు వరుణ్ తేజ్, స్పెయిన్ లో ఈ బ్యాచిలర్ పార్టీ కోసం వెళ్ళాడు అని తెలిసింది.

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వివాహం తేదీని కూడా ఖరారు చేసుకున్నట్టుగా వార్త తెలిసింది. ఈ వివాహం నవంబర్ మొదటి వారంలో ఉంటుందని, ఇది కూడా డెస్టినేషన్ వివాహం అని, ఇటలీలో వివాహం జరుగుతుందని తెలిసింది. వివాహం అయ్యాక, హైదరాబాద్ లో పరిశ్రమ వాళ్ళకోసం, స్నేహితుల కోసం రిసిప్షన్ ఏర్పాటు చేస్తారని కూడా తెలిసింది. వివాహానికి మాత్రం కేవలం కుటుంబానికి చెందిన దగ్గరి బంధువులు మాత్రమే హాజరవుతారని తెలిసింది.

Updated Date - 2023-09-30T13:20:38+05:30 IST