కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మెగా మేనల్లుడికి వరసగా మూడో ఫ్లాప్

ABN, First Publish Date - 2023-11-27T12:11:47+05:30

వైష్ణవ్ తేజ్ మాస్ అవతారంలో కనపడాలని 'ఆదికేశవ' సినిమాతో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు, కానీ ప్రేక్షకులకి అతను విలన్స్ కొట్టి చంపడం ఇష్టం లేదేమో, అందుకని ఆ సినిమాని అంతగా పట్టించుకోలేదు. మరి తదుపరి సినిమా ఎటువంటింది చేస్తాడో అని ఎదురుచూస్తున్నారు

Vaishnav Tej as Aadikeshava

'ఉప్పెన' #(Uppena) సినిమాతో సంచలనం సృష్టించిన మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, తరువాత సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా డీలా పడిపోయాడు. 'కొండపొలం' సినిమాతో నటుడిగా కొంచెం పేరు తెచ్చుకున్నా, వ్యాపారాత్మకంగా మాత్రం అతని సినిమాలు 'ఉప్పెన' తరువాత నడవ లేదు. వైష్ణవ్ తేజ్ గతవారం ఒక వ్యాపారాత్మకమైన సినిమా 'ఆదికేశవ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో శ్రీలీల కథానాయకురాలు, శ్రీకాంత్ రెడ్డి దర్శకుడు. ఇది ఒక యాక్షన్ సినిమా, కానీ ప్రేక్షకులు ఈ సినిమాని పట్టించుకోలేదు.

దీనితో మెగా మేనల్లుడుకి వరసగా మూడో ఫ్లాప్ వచ్చింది. మొదటి సినిమా 'ఉప్పెన' విజయంతో వైష్ణవ్ తేజ్ ని ఒక లవర్ బాయ్ గా చిన్న రొమాంటివ్ లవ్ స్టోరీస్ ఇతనితో చేయొచ్చు అని పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు అనుకున్నారు, కానీ అతను అవి కాకుండా యాక్షన్ సినిమాలని ఎంచుకోవటం, ఆ కథలకి అతను సరిగ్గా సరిపోకపోవడంతో, ప్రేక్షకులు ఈ 'ఆదికేశవ' ని తిప్పికొట్టారని తెలిసింది.

ఇంకో ఆసక్తికరం అంశం ఏంటంటే, ఇప్పుడు వైష్ణవ్ చేతిలో తదుపతి చెయ్యడానికి సినిమా లేదు. అతను 'ఆదికేశవ' సినిమా విడుదలైన తరువాత ఫలితం చూసి వేరే సినిమా చేద్దామని అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఫలితం అనుకున్న విధంగా రాకపోవటంతో అతను తదుపరి ఎటువంటి కథ చేస్తాడో అని వేచి చూస్తున్నారు. 'ఆదికేశవ' సినిమాని సితార ఎంటర్ టైనమెంట్స్ నాగవంశీ, సాయి సౌజన్య తో కలిపి నిర్మించారు.

Updated Date - 2023-11-27T12:11:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!