Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో ఇద్దరు గ్లామర్ అమ్మాయిలు

ABN , First Publish Date - 2023-12-06T12:50:20+05:30 IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న ఎన్.బి.కె 109 సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల బాలకృష్ణ సరసన నటించడానికి ఇద్దరు అందమైన నటీమణులను ఎంపిక చేసినట్టుగా సమాచారం

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో ఇద్దరు గ్లామర్ అమ్మాయిలు
Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఒక సినిమా తరువాత ఇంకో సినిమా షూటింగ్ చేస్తూ చాలా బిజీగా వున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లి (కె ఎస్ రవీంద్ర) తో (Bobby Kolli) ఒక పెద్ద బడ్జెట్ సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 109వ చిత్రమిది, దీనికి ఇంకా పేరు ఏమీ పెట్టలేదు. ఈ #NBK109 ఒక పోరాట సన్నివేశంతో షూటింగ్ మొదలెట్టారు, ఇప్పుడు ఈ సినిమాలో కథానాయికలు ఎవరు బాలకృష్ణ పక్కన నటిస్తున్నారో తెలుసా.

సితార ఎంటర్ టైనమెంట్స్ ఈ సినిమా నిర్మాణం చేస్తోంది. బాబీ కొల్లి ఇంతకు ముందు చిరంజీవికి 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు, అయితే ఇది ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ అని వార్త. ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన మీనాక్షీ చౌదరిని కథానాయికగా తీసుకున్నట్టుగా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఆమె సితార ఎంటర్ టైనమెంట్స్ తీస్తున్న 'గుంటూరు కారం' లో మహేష్ బాబు పక్కన కూడా చేస్తోంది. ఆ చిత్రంలో ఆమె నటన చూసి, నిర్మాతలు ఆమెనే ఈ బాలకృష్ణ సినిమాకి కూడా తీసుకున్నారని టాక్. (Meenakshi Chaudhary and Urvashi Rautela are playing female leads opposite Nandamuri Balakrishna in his film with director Bobby Kolli)

meenakshichaudharybalayya.jpg

ఇంతకు బాబీ దర్శకత్వం వహించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాలో ఊర్వశి రౌటేలా ఒక ప్రత్యేక పాటలో కనిపించారు. ఆమె బాలీవుడ్ లో కొంచెం పేరున్న నటి కావటంతో ఇప్పుడు ఈ బాలకృష్ణ సినిమాలో ఆమెకి ఒక ప్రత్యేక పాత్ర ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కూడా బాలకృష్ణ, ఊర్వశి రౌటేలాపై చిత్రీకరిస్తున్నారని తెలిసింది. అలాగే ఊర్వశి స్పెషల్ పాటల స్పెషలిస్ట్ కూడా కావటంతో ఇందులో ఒక అదిరిపోయే మాస్ పాట కూడా ఉంటుంది అని అంటున్నారు.

Urvashi1.jpg

మూడు వరస సినిమాలతో బాలకృష్ణ మంచి జోష్ మీద వున్నారు. ఇంతకు ముందు సినిమా 'భగవంత్ కేసరి' పెద్ద హిట్ అవటమే కాకుండా, అందులో ఒక సందేశం కూడా ఇమిడి ఉండటంతో బాలకృష్ణ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో బాలకృష్ణ గెడ్డం తో కనపడితే ఈ సినిమాలో ఆ గెడ్డం తీసేసి బాలకృష్ణ మళ్ళీ కుర్రాడిగా కనిపిస్తారు అని అంటున్నారు. 'గెడ్డం తీసేసాక అద్దంలో చూసుకొని నన్ను నేనే పోల్చుకోలేకపోయాను' అని బాలకృష్ణ ఇంతకు ముందు ఒక చిత్ర ప్రచారంలో అన్నారు. ఇక ఈ సినిమాలో పోరాటాలు కూడా బాలకృష్ణకి సరిపోయే విధంగా వుంటాయని చెపుతున్నారు. ఈ సినిమాని నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య తో కలిసి నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-12-06T12:50:22+05:30 IST