Chiranjeevi fantasy movie: చిరంజీవి సినిమాలో విలన్ ఎవరో తెలిస్తే షాకవుతారు, అదిరిపోయే కాంబినేషన్

ABN , First Publish Date - 2023-10-02T10:49:40+05:30 IST

చిరంజీవి, మల్లిడి వసిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న ఫాంటసీ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఒక టాప్ తెలుగు నటుడు చేస్తున్నాడని సమాచారం. అతనికి కథ చెప్పాడని, నచ్చిందని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలిసింది. ఇంతకీ అతనెవరంటే..

Chiranjeevi fantasy movie: చిరంజీవి సినిమాలో విలన్ ఎవరో తెలిస్తే షాకవుతారు, అదిరిపోయే కాంబినేషన్
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) తన తదుపరి సినిమాకి సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఒక ఫాంటసీ మూవీ గా తెరకెక్కనుంది, దీనికి మల్లిడి వసిష్ఠ (MallidiVasishta) దర్శకత్వం వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే. యూవీ క్రియేషన్స్ (UVCreations) ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో మొదలైంది. దర్శకుడు ఈ సినిమాకి కావలసిన గ్రాఫిక్స్, ఇందులో నటించబోయే ఇతర తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో వున్నాడు అని తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథకి ఒక బలమైన ప్రతినాయకుడు కావాలని దర్శకుడు, చిరంజీవి అనుకున్నారు. అందుకు చాలామందిని అనుకున్నా, చివరికి ఒక తెలుగు నటుడినే ఎంపిక చెయ్యాలని అనుకొని అందుకు సరైన వాడు భల్లాలదేవుడు అని దర్శకుడు అన్నాడట. చిరంజీవి కూడా ఒకే చెప్పారు అని తెలిసింది. 'బాహుబలి' #Baahubali లో తన భల్లాలదేవుడు పాత్రలో రానా దగ్గుబాటి (RanaDaggubati) ఒదిగిపోయిన తీరు చొసి అందరి మనసులను గెలించాడు.

rana.jpg

ఇప్పుడు ఆ రానా దగ్గుబాటి #RanaDaggubati చిరంజీవి, మల్లిడి వసిష్ఠ సినిమాలో విలన్ గా కనపడనున్నాడు. రానా దగ్గుబాటి, ఇటు తెలుగులోనూ అటు ఇతర భాషల్లోనూ కూడా మంచి పేరు వున్న నటుడు. దానికి తోడు ఒక బలమైన ప్రతినాయకుడిగా మెప్పిస్తాడు కూడా. అందుకని రానా దగ్గుబాటి కి దర్శకుడు కథ చెప్పాడని, అతను కూడా ఈ పాత్ర చెయ్యడానికి ఒప్పుకున్నాడని తెలిసింది. అయితే ఇది అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారా వేచి చూడాల్సిందే.

దర్శకుడు మల్లిడి వసిష్ఠ ఇంతకు ముందు కళ్యాణ్ రామ్ (KalyanRam) తో 'బింబిసార' #Bimbisara సినిమా చేసాడు. అది అతని మొదటి సినిమా, అది కూడా ఫాంటసీ సినిమానే. ఇప్పుడు చిరంజీవితో కూడా ఫాంటసీ సినిమా చేస్తుండటం ఆసక్తికరం. అలాగే ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారని అందులో ఒకరి ఐశ్వర్య రాయ్ (AishwaryaRai) అని కూడా వార్తలు వస్తున్నాయి.

Updated Date - 2023-10-02T10:49:40+05:30 IST