Tollywood gossip; వాళ్ళతో వేగలేక ఈ హీరో విడిపోయాడు, వేరే కాపురం కూడా పెట్టేసాడు !

ABN , First Publish Date - 2023-07-10T11:22:47+05:30 IST

చాలామంది నటులు, నటీమణుల కెరీర్ తల్లిదండ్రుల వలన నాశనం అయిపోయిన సంఘటనలు ఎన్నో వున్నాయి. అయితే ఆలా జరగకుండా ఈ యువ నటుడు తప్పు తెలుసుకొని, తల్లి దండ్రులను దూరం పెట్టి, వేరే కాపురం పెట్టుకున్నాడు అని పరిశ్రమలో టాక్.

Tollywood gossip; వాళ్ళతో వేగలేక ఈ హీరో విడిపోయాడు, వేరే కాపురం కూడా పెట్టేసాడు !
ఈ నటుడిని గుర్తు పట్టారా

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలామంది నటీనటులకు వారి కెరీర్ మొదటి రోజుల్లో ఎక్కువగా తల్లిదండ్రులే ముందుండి నడిపిస్తూ వుంటారు. కొన్ని సినిమాలు చేసాను, ఆ నటీనటులకు కొంచెం పరిశ్రమ మీద అవగాహన వచ్చి, తల్లిదండ్రులను పక్కన పెట్టుకుంటారు, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం స్వంతంగానే తీసుకుంటారు. తల్లి పెత్తనం, తండ్రి పెత్తనం వలన కొందరు నటీనటులు తమ కెరీర్ ని నాశనం చేసుకున్న ఉదాహరణలు ఎన్నో వున్నాయి మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో. పేర్లు అనవసరం, ఎందుకంటే అందరికీ తెలుసు ఆ నటులు ఎవరు అనేది, మొదట్లో వైభవంగా వెలిగిన వాళ్ళు ఈరోజు ఏమి చేస్తున్నారో చూస్తున్నాం.

అయితే ఇప్పుడు ఇంకొక నటుడికి (హీరో) కి ఇటువంటి సమస్యే వచ్చింది. ఈ నటుడు పేరు చెప్పి తల్లిదండ్రులు చాలామంది నిర్మాతల దగ్గర అప్పులు తీసుకున్నారు. కొడుకు మంచి నటుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ నటుడికి మొదట్లో మేనేజర్ ఉండేవాడు కానీ, అతని తల్లిదండ్రుల జోక్యం ఎక్కువ అయిపోవటం వలన మేనేజర్స్ కూడా తప్పుకున్నారు. అన్నీ ఆ తల్లిదండ్రులే చూసుకోవటం మొదలెట్టారు.

ఇలా చేసి చాలామంది నిర్మాతల దగ్గర అడ్వాన్స్ లు తీసుకొని అప్పులు కూడా చాలా చేశారు అని ఇప్పుడు పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈమధ్యనే ఈ సదరు హీరో గారు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక తన తప్పు తెలుసుకున్నాడు. తల్లి దండ్రులను తన కెరీర్ లో ఇక జోక్యం చేసుకోవద్దంటూ చాలా క్లియర్ గా చెప్పేసాడు. పెళ్ళికి ముందు వరకు తల్లిదండ్రులతో కలిసి వున్న ఈ మంచి నటన కనపరిచే హీరో గారు ఇప్పుడు వేరే కాపురం పెట్టుకొని తన కెరీర్ మీద దృష్టి సారించాడు.

తల్లిదండ్రుల వలన వరసగా సినిమాలు ఫ్లాప్ అవటమే కాకుండా, అప్పులు కూడా మిగిలాయి. మొన్న వేరు కాపురం పెట్టె టైముకు సుమారు రూ. 8 కోట్ల వరకు అప్పులు వున్నట్టుగా తెలిసి షాక్ అయ్యాడు. పరిశ్రమలో ఇప్పుడు ఈ హీరో గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఆ హీరో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇన్నాళ్ళకి అని పరిశ్రమలో చాలామంది చెప్పుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు ఒక ప్రొడక్షన్ సంస్థ ని కూడా ప్రారంభించారండోయ్. వాళ్ళు ఆ సంస్థలో కొన్ని సినిమాలు తీశారు, ముఖ్యంగా కొడుకునే హీరోగా పెట్టి, కానీ ఈమధ్యనే ఒక కొత్త సినిమా ప్రకటించారు, అయితే అది మన హీరో గారితో కాదు, వేరే వాళ్ళతో ఉంటుంది అని చెప్పారు, అదే ఇప్పుడు పరిశ్రమలో ఎక్కువగా టాక్ నడుస్తోంది. దీన్ని బట్టే అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది కదా వాళ్ళ ప్రభావం పాపం ఆ నటుడి మీద ఎంత వుందో !

అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు జాగ్రత్త పడ్డాడు. చాలామంది నటుల కెరీర్ లా తనది కూడా కాకూడదు అనుకోని, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అని పరిశ్రమలో చర్చించుకుంటున్నారు కూడా. చేతిలో ఒకటి రెండు సినిమాలు వున్నాయి, అందులో ఒకటి విజయం సాధించినా, మన హీరో గారు సరైన ట్రాక్ లో పడిపోతారు.

Updated Date - 2023-07-10T11:22:47+05:30 IST