Ustaad Bhagath Singh: పవన్ కళ్యాణ్ రోజుకి ఎన్ని గంటలు పనిచేసారో తెలిస్తే షాకవుతారు

ABN , First Publish Date - 2023-09-30T13:53:14+05:30 IST

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ముగించుకొని మళ్ళీ తన రాజకీయ పర్యటనలో ఆంధ్ర ప్రజలను కలవటానికి వెళ్లారు. అతను షూటింగ్ ఎన్ని గంటలు చేశారు, ఎలా చేశారు తెలిస్తే మాత్రం షాక్ అవుతారు, పవన్ కళ్యాణ్ కి తన సినిమా ఎలా పూర్తి చెయ్యాలన్న తపన వుందో తెలుస్తుంది.

Ustaad Bhagath Singh: పవన్ కళ్యాణ్ రోజుకి ఎన్ని గంటలు పనిచేసారో తెలిస్తే షాకవుతారు
Pawan Kalyan from Ustaad Bhagat Singh

పవన్ కళ్యాణ్ (PawanKalyan), అటు రాజకీయ సమావేశాలతో బిజీగా ఉంటూనే, ఇటు తన సినిమాలకి కూడా కొంత కాలాన్ని వెచ్చించి నిర్మాతలకు ఇబ్బంది లేకుండా షూటింగ్స్ కి హాజరవుతున్నారు. ఆలా కొన్ని రోజులు 'ఉస్తాద్ భగత్ సింగ్' ##UstaadBhagatSingh సినిమాకి కేటాయించారు పవన్ కళ్యాణ్. ఈరోజు ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ (HarishShankar) ట్వీట్ చేస్తూ, చాలా ముఖ్యమైన, ఇంటెన్స్ సన్నివేశాలు చిత్రీకరించామని ఆ ట్వీట్ లో చెప్పాడు. దీనితో ఈ సినిమా చాలా భాగం పూర్తయిందని కూడా తెలుస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్ కి కొన్ని రోజులు కేటాయించినప్పుడు చిత్ర దర్శకుడిని, నిర్మాతని పిలిచి ఏమి చెప్పారో తెలిస్తే పవన్ కళ్యాణ్ సినిమా పట్ల వున్న డెడికేషన్ ఏంటో అర్థం అవుతుంది. "నేను కొన్ని రోజులు మాత్రం సినిమాకి కేటాయిస్తాను, అయితే ఆ వున్నన్ని రోజులు మాత్రం రోజుకు 14 నుండి 16 గంటలు షూటింగ్ కి కేటాయిస్తాను, మీరు దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకోండి," అని చెప్పారని తెలిసింది. ఎందుకంటే ఒక సన్నివేశం చిత్రీకరణ అయిపోగానే, కారవాన్ లోకి వెళ్లి కూర్చవటం వుండకూడదు, వెంటనే ఇంకో సన్నివేశానికి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పారని, ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' కి అలానే జరిగింది అని తెలిసింది.

pawan-kalyan1.jpg

పవన్ కళ్యాణ్ రోజుకి 14 నుండి 16 గంటలు అనగానే, అతనికి తగ్గట్టుగానే దర్శకుడు హరీష్ శంకర్ రెండు యూనిట్ లను ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. ఒక సన్నివేశం చిత్రీకరణ అయిపోగానే, కొన్ని నిముషాల మాత్రమే గ్యాప్ తీసుకొని వెంటనే ఇంకో సన్నివేశానికి ఏర్పాట్లు చేసుకొని అలా షూటింగ్ చేసినట్టుగా తెలిసింది. ఉస్తాదు భగత్ సింగ్ షూటింగ్ ముగించుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ వారాహి యాత్రకి బయలుదేరారు. ఈ సినిమాకి ఇంకా సుమారు 15 రోజులు పవన్ కళ్యాణ్ కేటాయిస్తే సినిమా పూర్తి అయిపోతుందని కూడా అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దీనికి నిర్మాతలు. ఇందులో శ్రీలీల (Sreeleela) కథానాయిక.

Updated Date - 2023-09-30T13:53:14+05:30 IST