Yatra 2: చంద్రబాబు పాత్ర ఎవరు వేస్తున్నారు అంటే...

ABN , First Publish Date - 2023-10-27T14:03:03+05:30 IST

దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర 2' సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా వుండబోతోంది అని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం ఒక నటుడిని కూడా సెలెక్ట్ చేశారని, అతను ఎవరంటే...

Yatra 2: చంద్రబాబు పాత్ర ఎవరు వేస్తున్నారు అంటే...
Director Mahi V Raghav

మహి రాఘవ (MahiVRaghava) 'యాత్ర 2' #Yatra2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSRajasekharReddy) చనిపోయిన తరువాత కథగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఫిబ్రవరిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు మహి రాఘవ్. ఇది పూర్తిగా వైఎస్ జగన్ (YSJagan) కి, అతని పార్టీకి అనుకూలంగా వుండేట్టుగా తీస్తున్న సినిమా.

'యాత్ర' #Yaatra సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్ర వేసిన మమ్మూట్టి (Mammootty) ఇందులో కూడా కనపడతారు. అలాగే వైఎస్ జగన్ గా తమిళ నటుడు జీవా (Jiiva) కనిపించనున్నాడు. ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు (ChandrababuNaidu) పాత్ర కూడా వుండబోతోంది అని తెలిసింది.

maheshmanjrekar.jpg

అయితే ఇంతకీ చంద్రబాబు పాత్రలో ఎవరు కనపడనున్నారో సాంఘికా మాధ్యమాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ కి చెందిన మహేష్ మంజ్రేకర్ (MaheshManjrekar), చంద్రబాబు పాత్రలో కనపడతారని, మహి రాఘవ్ అందుకే అతనికి తర్ఫీదు కూడా ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం మహి రాఘవ్ ఈ సినిమా మీదే పూర్తిగా దృష్టి పెట్టినట్టుగా కనపడుతోంది. ఆంధ్ర లో వచ్చే ఎన్నికలకి ముందు ఈ సినిమా విడుదల చెయ్యాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Updated Date - 2023-10-27T14:03:03+05:30 IST