కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nandamuri Balakrishna: బాలయ్య వరస విజయాల వెనక రహస్యం ఆమేనా?

ABN, First Publish Date - 2023-11-18T11:24:37+05:30

నందమూరి బాలకృష్ణ వరస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లితో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. తరువాత సినిమాలు కూడా అప్పుడే నిర్ణయించారని, అయితే బాలయ్య విజయ రహస్యం ఏంటి అంటే...

A still from Bhagavanth Kesari

నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) వరస సినిమాలతో విజయకేతనం ఎగురవేస్తున్నారు. ముందు 'అఖండ' #Akhanda థియేటర్స్ లో విడుదలై పెద్ద విజయం సాధించటమే కాకుండా, ఆ సినిమా ఓటిటి లో కూడా అద్భుత విజయం నమోదు చేసుకుంది. ఓటిటి లో ఆ సినిమాకి వచ్చిన ఆదరణ చూసిన తరువాతే, దర్శకుడు బోయపాటి (BoyapatiSreenu) సినిమాలకి ఓటిటి లో ఇంకా బాగా గిరాకీ పెరిగింది అని పరిశ్రమలో టాక్ కూడా వినిపించింది. ఆ సినిమా తరువాత బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' #VeerasimhaReddy సినిమాతో ఇంకో పెద్ద ఘనవిజయం సాధించారు.

ఈమధ్య విడుదలైన 'భగవంత్ కేసరి' #BhagavanthKesari అనే సినిమాతో హాట్రిక్ విజయాలు నమోదు చేసుకొన్న బాలకృష్ణ తన విజయ పరంపర వరస విజయాలతో కొనసాగిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం జరిగిన 'భగవంత్ కేసరి' విజయ సమావేశానికి బాలకృష్ణ తో పాటు, అతని చిన్న కుమార్తె తేజస్విని (NandamuriTejaswini) కూడా వచ్చారు. బాలకృష్ణ ఆమెని వేదికమీదకి ఆహ్వానించడమే కాకుండా, ఆమెకి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో (KRaghavendraRao) షీల్డు కూడా ఇప్పించారు.

అయితే ఇప్పుడు పరిశ్రమలో వున్న టాక్ ఏంటంటే, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినికి సినిమాలంటే ఆసక్తి వుంది అని, త్వరలో ఆమె నిర్మాతగా మారే అవకాశం ఉందని కూడా చెపుతున్నారు. ఎందుకంటే ఆమె 'భగవంత్ కేసరి' సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా ఎలా జరుగుతోంది, ఎలా వస్తోంది అనే విషయాలని సెట్స్ కి వెళ్లి ఎప్పటికప్పుడు తెలుసుకోవటం జరిగిందని అంటున్నారు. అలాగే ఆమె తన తండ్రి బాలకృష్ణ చెయ్యబోయే పాత్ర గురించి చాలా శ్రద్ధ కనపరచారు అని కూడా అంటున్నారు. ఆమె కూడా కథలు వింటున్నారని, త్వరలోనే సినిమా ఉండొచ్చు అని పరిశ్రమలో అనుకుంటున్నారు.

ఇప్పుడు బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి (BobbyKolli) సినిమా షూటింగ్ జరుగుతోంది, ఈ సినిమా గురించి కూడా తేజస్వి ఆసక్తి చూపించారు అని, సినిమా ఎలా వస్తోంది, ఎలా జరుగుతోంది అనే విషయాలు తెలుసుకుంటున్నారు అని ఒక టాక్ నడుస్తోంది. ప్రొడక్షన్ విషయాలని కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారని, ఇవన్నీ నిర్మాతగా తెలుసుకోవలసిన అవసరం ఉందని అందుకనే ఆసక్తి కనపరచారని కూడా అంటున్నారు. అలాగే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (NandamuriMokshagna) కూడా త్వరలోనే ఆరంగేట్రం చేయనున్నాడని, ఆ సినిమాకి నిర్మాతగా తేజస్విని వ్యవహరించవచ్చని కూడా అంటున్నారు.

Updated Date - 2023-11-18T11:24:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!