కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Samajavaragamana: ఈ హిట్ జంట మళ్ళీ కలుస్తున్నారు

ABN, First Publish Date - 2023-09-07T19:36:38+05:30

ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో పెద్ద విజయం సాధించిన సినిమాలలో ఒకటిగా నిలించింది 'సామజవరగమన'. ఇందులో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి...

Sreevishnu and Reba Monica John are going to share screen space once again

ఈమధ్య చిన్న సినిమాలలో పెద్ద హిట్ గా నిలిచిన దానిలో 'సామజవరగమన' #Samajavaragaman సినిమా ఒకటి. ఇది మొదటి నుండి చివరి వరకు వినోదాత్మకంగా ఉండటమే అందుకు కారణం. దీనికి రామ్ అబ్బరాజు (RamAbbaraju) దర్శకుడు కాగా, ఇందులో శ్రీవిష్ణు (SreeVishnu), రెబా మోనికా జాన్ (RebaMonicaJohn) జంటగా నటించారు. రెబ మోనికా జాన్ ఇంతకు ముందు మలయాళం, కన్నడ, తమిళ సినిమాలు చేసినా 'సామజవరగమన' ఆమె మొదటి తెలుగు సినిమా. ఇలా మొదటి తెలుగు సినిమాతోనే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది రెబా మోనికా జాన్.

ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్ళీ ఇంకో సినిమా కలిపి చేస్తున్నారని ఒక టాక్. ఈ సినిమా ఈనెల 9 వ తేదీన అధికారికంగా ప్రారంభం అవుతోందని కూడా అంటున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎవరు నిర్మిస్తున్నారో తెలుసా, గుణ్ణం గంగరాజు (GunnamGangaraju). ఈ సినిమాతో మళ్ళీ నిర్మాతగా గుణ్ణం గంగరాజు వస్తున్నారు. 'సామజవరగమన' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు ఈ రాబోయే సినిమాలో కూడా ఒక వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడు అని తెలిసింది.

అతను ఇప్పుడు 'స్వాగ్' అనే సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు, మళ్ళీ ఈ సినిమా కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది అని తెలిసింది. 'సామజవరగమన' సినిమాతో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జనతా హిట్ పెయిర్ గా నమోదవడంతో అదే జంటని ఈ కొత్త సినిమాలో కూడా రిపీట్ చెయ్యాలని నిర్మాత గుణ్ణం గంగరాజు భావించినట్టుగా తెలిసింది.

Updated Date - 2023-09-07T19:36:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!