Samyuktha: మరో సినిమా ఛాన్స్ కొట్టేసింది, పారితోషికం కూడా పెంచేసింది

ABN , First Publish Date - 2023-08-14T15:56:47+05:30 IST

ఆమె ఇంతవరకు నాలుగు తెలుగు సినిమాలు చేసింది, నాలుగు సినిమాలు వరసగా హిట్ అయ్యాయి. ఆమె తమ సినిమాలో ఉంటేనే హిట్ అంటున్నారు ఇప్పుడు, ఆమె మరెవరో కాదు సంయుక్త. ఇప్పుడు ఇంకో పీరియడ్ డ్రామా సినిమా ఒప్పుకుంది, అలాగే పారితోషికం కూడా పెంచింది.

Samyuktha: మరో సినిమా ఛాన్స్ కొట్టేసింది, పారితోషికం కూడా పెంచేసింది
Samyuktha

పవన్ కళ్యాణ్ (PawanKalyan), రానా దగ్గుబాటి (RanaDaggubati) నటించిన మల్టి స్టారర్ సినిమా 'భీమ్లా నాయక్' #BheemlaNayak తో ఆరంగేట్రం చేసింది మలయాళ అమ్మాయి సంయుక్త (Samyuktha). ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది, వెంటనే 'బింబిసార' #Bimbisara లో కళ్యాణ్ రామ్ (NandamuriKalyanRam) పక్కన నటించింది. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాక, మూడో సినిమా 'సర్' #Sir పెద్ద స్టార్ అయిన ధనుష్ (Dhanush) పక్కన నటించింది. ఇది తెలుగు, తమిళంలో కూడా విడుదలైంది. ఈ మూడో సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవటమే కాకుండా, సంయుక్త ని లక్కీ మస్కట్ అనేట్టుగా చేసింది.

samyuktha4.jpg

ఇలా మూడు సినిమాలు వరసగా హిట్ అయ్యాక, తరువాత 'విరూపాక్ష' #Virupaksha లో సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) పక్కన నటించిన సినిమా విడుదలైంది. ఇది ఇంకా పెద్ద హిట్ అయింది. ఇలా వరసగా నాలుగు తెలుగు సినిమాలు చేసి నాలుగు హిట్ అవ్వటం అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆమెని లక్కీ మస్కట్ అని పిలిచేవారు కదా, ఈ నాలుగో సినిమా హిట్ అయ్యాక ఆమె కాస్త గోల్డెన్ లెగ్ అయింది. ఇలా వరసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న సంయుక్త ఇప్పుడు ఇంకో సినిమా ఒప్పుకుంది అని టాక్.

samyuktha3.jpg

చేతిలో 'డెవిల్' #Devil సినిమా వుంది. ఇందులో రెండోసారి కళ్యాణ్ రామ్ తో చేస్తోంది. ఈ సినిమా కాకుండా సంయుక్త నిఖిల్ సిద్ధార్థ (NikhilSiddhartha) తో ఒక సినిమా చేస్తోంది అని అంటున్నారు. నిఖిల్ తాజా సినిమా 'స్పై' #Spy విడుదలైంది కానీ థియేటర్స్ లో అంతగా నడవలేదు. కానీ నిఖిల్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు అందులో 'స్వయంభు' #Swayambhu అనే సినిమా ఒకటి. ఈ సినిమాలో నిఖిల్ పక్కన సంయుక్త నటిస్తోంది అని తెలిసింది. అలాగే వరస నాలుగు హిట్స్ ఇచ్చిన సంయుక్త తన పారితోషికం కూడా బాగానే పెంచేసింది అని అంటున్నారు.

samyuktha2.jpg

ఇంకో ఆసక్తికర అంశం ఎంతటి ఈమె చేసిన సినిమాలలో ఎక్కువ పీరియడ్ డ్రామాలే. ధనుష్ తో చేసిన 'సర్', సాయి ధరమ్ తేజ్ తో చేసిన 'విరూపాక్ష', అలాగే 'బింబి సార', ఇప్పుడు చెయ్యబోయే 'డెవిల్' కూడా ఇవన్నీ పీరియడ్ డ్రామా కథలు. ఇలా వీటన్నిటిలో ఈమె నటించడం కేవలం యాదృచ్చికమే అయ్యుంటుంది.

Updated Date - 2023-08-14T15:56:47+05:30 IST