Samantha: సమంత కొత్త ఇల్లు ఎంతకి కొనుక్కుందో తెలుసా...

ABN , First Publish Date - 2023-05-09T12:03:02+05:30 IST

దక్షిణాదిలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో సమంత ఒకరు. ప్రస్తుతం 'ఖుషీ' సినిమా, 'సిటాడెల్' హిందీ వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్న,సమంత ఒక కొత్త డూప్లెస్ హౌస్ కొనుక్కుంది. దానికయిన ఖర్చు ఎంతో తెలుసా...

Samantha: సమంత కొత్త ఇల్లు ఎంతకి కొనుక్కుందో తెలుసా...

సమంత రూత్ ప్రభు (SamanthaRuthPrabhu) ఇప్పుడు వార్తల్లో వున్న నటి. ఆమధ్య మయోసిటిస్ (Myositis) అనే వ్యాధిని బారి పడి సిక్ అయిన సమంత, కోలుకొని సినిమా షూటింగ్ లో ఇప్పుడు పాల్గొంటోంది. 'సిటాడెల్' (Citadel) హిందీ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది, అలాగే ఒక హిందీ సినిమా కూడా చేస్తోంది అని వార్తలు వస్తున్నాయి తెలుగు సినిమా 'ఖుషి' (Kushi) విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పక్కన కథానాయకురాలిగా కూడా చేస్తోంది. ఇంకా వేరే తెలుగు సినిమాలు ఏవీ ఒప్పుకోలేదు అని కూడా అంటున్నారు.

samatha-new1.jpg

ఇదిలా ఉంటే, సమంత ఈమధ్యన హైదరాబాద్ ఓ ఒక పెద్ద డూప్లెస్ హౌస్ కొన్నది అని ఒక ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. ఈ ఇంటికోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా, సుమారు రూ.7.8 కోట్లు పెట్టి ఈ డూప్లెస్ హౌస్ తీసుకుందని ఇది 13, 14 అంతస్థులలో ఉందని, ఇది సుమారు 7,944 చదరపు అడుగులు ఉందని పేర్కొంది. సమంత స్నేహితురాలు శిల్ప రెడ్డి (ShilpaReddy) ద్వారా ఈ ఇల్లు కొనుక్కుందని సమాచారం. జయభేరి లి అవుట్ లో ఈ డూప్లెస్ హౌస్ వున్నట్టుగా తెలుస్తోంది.

డూప్లెస్ హౌస్ 13వ ఫ్లోర్ లో 3,920 చదరపు అడుగులు, అలాగే 14వ అంతస్థులో 4,024 చదరపు అడుగులు వున్న ఈ ఇల్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అని తెలిసింది. సమంత కి డాగ్స్ కూడా వున్నాయి, అలాగే ఆమెకి ఇందులో ఒక హోమ్ థియేటర్ కూడా ఉన్నట్టు భోగట్టా.

samantha-citadel.jpg

సమంత 'ఖుషి' సినిమాకి రూ.5 కోట్ల పారితోషికం తీసుకుందని కూడా ఒక సమాచారం. అలాగే 'శాకుంతలం' (Shaakuntalam) సినిమాకి ఇంకా ఎక్కువగానే పారితోషికం అందిందని అంటున్నారు. ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో సమంత ఒకరు. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన 'శాకుంతలం' సినిమా పెద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-05-09T12:03:02+05:30 IST