Sai Dharam Tej: 'గంజా శంకర్' గా సాయి ధరమ్ తేజ్

ABN , First Publish Date - 2023-10-14T12:24:47+05:30 IST

అక్టోబర్ 15 సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అతను దర్శకుడు సంపత్ నందితో చెయ్యబోయే సినిమా నుండి మొదటి లుక్, సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం వుంది. ఈ సినిమా టైటిల్ 'గంజా శంకర్' అని అనుకుంటున్నట్టుగా సమాచారం.

Sai Dharam Tej: 'గంజా శంకర్' గా సాయి ధరమ్ తేజ్
Sai Dharam Tej

మామయ్య పవన్ కళ్యాణ్ (PawanKalyan) తో 'బ్రో' #Bro సినిమా చేసిన తరువాత సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) విశ్రాంతి తీసుకుంటున్నారు. తరువాత సంపత్ నంది సినిమా చేయాల్సి వుంది, కానీ సాయి తేజ్ ఈ సినిమాకి బరువు తగ్గాలని అనుకున్నాడు, అందుకనే వెంటనే షూటింగ్ మొదలెట్టలేదు అని తెలిసింది. 'బ్రో' విజయంతో మామయ్య పవన్ కళ్యాన్ తో నటించడంతో పాటు సాయి ధరమ్ తేజ్ కి కూడా విపరీతమైన పేరు వచ్చింది. బైక్ ప్రమాదం జరిగిన తరువాత విడుదలైన 'విరూపాక్ష' #Virupaksha, తరువాత 'బ్రో' రెండు సినిమాలు సాయి తేజ్ కి మంచి విజయాలు అందించటంతో అతని కెరీర్ గ్రాఫ్ ని పైకి తీసుకెళ్లాయి అనే చెప్పాలి.

ganjashankar.jpg

రేపు అంటే అక్టోబర్ 15 సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు Sai Dharam Tej Birthday is on October 15. అందుకని సంపత్ నందితో చెయ్యబోయే సినిమా నుండి మొదటి లుక్, సినిమా టైటిల్ కూడా విడుదల చేసే అవకాశం వుంది. ఈరోజు ఆ సినిమా గురించి వచ్చిన ప్రకటనలో సాయి ధరమ్ తేజ్ ఫుల్ మాస్ గా ఇందులో ఉంటాడని, ఇది ఒక పూర్తి వ్యాపారాత్మక చిత్రం అని అర్థం అయిపోతోంది. ఈ సినిమాని సితార ఎంటర్ టైనమెంట్ (SitharaEntertainments) నిర్మిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) భార్య సాయి సౌజన్య (SaiSoujanya) కూడా ఒక నిర్మాత.

poojahegde-new3.jpg

ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన పూజ హెగ్డే (PoojaHegde) కథానాయకురాలిగా నటించనుంది. ఇక ఆమె మెగా నటుల అందరి పక్కన చేస్తూ వస్తున్నారు. ఇంతకు ముందు అల్లు అర్జున్ (AlluArjun) తో 'దువ్వాడ జగన్నాధం' (DuvvadaJagannadham), 'ఆల వైకుంఠపురం లో' #AlaVaikuntapuramLo రెండు సినిమాలు చేశారు. వరుణ్ తేజ్ (VarunTej) తో 'గద్దలకొండ గణేష్', రామ్ చరణ్ (RamCharan), చిరంజీవి (Chiranjeevi) నటించిన 'ఆచార్య'లో పూజ హెగ్డే నటించారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తో ఈ 'గంజా శంకర్' #GanjaShankar లో నటిస్తోంది పూజ హెగ్డే. ఇలా మెగా కుటుంబం నుండి వచ్చిన నటులు పక్క చేస్తున్న ఘనత సంపాదించింది పూజ.

ఇదిలా ఉండగా, ఈ గంజా శంకర్ పాత్ర కోసం సాయి ధరమ్ తేజ్ బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో, ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మొదలవ్వదని తెలిసింది. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ కరెక్టు షేప్ రావటానికి ఇంకా రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉన్నందున ఈ సినిమా షూటింగ్ వచ్చే సంక్రాంతి పండగ తరువాత మొదలయ్యే అవకాశాలు వున్నాయి అని తెలిసింది.

Updated Date - 2023-10-14T12:24:47+05:30 IST