RGV Vyooham: 'వ్యూహం' సినిమా సెన్సారు బెంగుళూరులో జరిగిందని బోగట్టా..

ABN , First Publish Date - 2023-12-15T19:02:33+05:30 IST

నిర్మాత నట్టి కుమార్ 'వ్యూహం' చిత్రం హైదరాబాదులో రివైజింగ్ కమిటీ చైర్మన్ జీవిత రాజశేఖర్ చెయ్యకూడదు అని కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అందువలన ఈ చిత్రాన్ని బెంగుళూరు పంపినట్టుగా, అక్కడ సభ్యులకి ఈ చిత్రం వెనక వున్న వివాదం తెలియకపోవడంతో వెంటనే సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా ఒక భోగట్టా. ఇదిలావుంటే దావూద్ ఇబ్రహీం పేరు చెప్పి వర్మ మళ్ళీ వివాదంలో ఇరుక్కున్నారు అని కూడా అంటున్నారు.

RGV Vyooham: 'వ్యూహం' సినిమా సెన్సారు బెంగుళూరులో జరిగిందని బోగట్టా..
Controversial director Ram Gopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి వివాదంలో వున్నారు. 'వ్యూహం' #Vyooham సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన సినిమా 'వ్యూహం' సెన్సారు కోసం అంతర్జాతీయ క్రిమినల్ గా పేరుపడ్డ దావూద్ ఇబ్రహీం పేరు వాడుకోవటంతో వర్మ వివాదంలో పడ్డారు అని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ తెలుగులో 'వ్యూహం' సినిమా సెన్సార్ చెయ్యకూడదు అని నిర్మాత నట్టి కుమారు కోర్టుకు వెళ్లడంతో, ఇక్కడ ఆ సినిమా సెన్సార్ ఆగిపోయింది. (RGV's Vyooham movie censored in Benguluru, says a source)

అయితే ఇప్పుడు వర్మ తన సినిమా సెన్సార్ అయిపోయిందని, సర్టిఫికెట్ కూడా చూపిస్తూ సాంఘీక మాధ్యమంలో పోస్ట్ పెట్టారు వర్మ. తన సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని కూడా చెప్పారు ఇందులో. నట్టి కుమార్ వర్మ సినిమాలో రాజకీయాలతో కూడిన నేపధ్యం వుంది అని చెప్పి, ఇక్కడ చెయ్యకూడదు అని కోర్టు కి వెళ్లారు. ఇక్కడ సెన్సార్ బోర్డు ఈ 'వ్యూహం' సినిమాని రివైజింగ్ కమిటీ కి పంపింది, రివైజింగ్ కమిటీ చైర్మన్ గా నటి జీవిత రాజశేఖర్ వున్నారు. అయితే జీవిత ఇంతకు ముందు వైస్సార్సీపీ లో పని చేశారని, అందుకని 'వ్యూహం' సెన్సార్ ఆమె చెయ్యకూడదు అని నట్టి కుమార్ కోర్టుకు వెళ్లడంతో ఇక్కడ చెయ్యలేదు.

rgv-vyoohyam.jpg

సెన్సార్ బోర్డు ఈ సినిమా సెన్సార్ కోసం బెంగుళూరు పంపినట్టుగా తాజా సమాచారం ప్రకారం తెలిసింది. బెంగుళూరులో ఈ సినిమా సెన్సార్ అయిందని, అక్కడ సెన్సార్ సభ్యులకి ఈ సినిమా కోసం రాజకీయ నాయకుల పేర్లు వర్మ ఏ విధంగా వాడుకున్నాడు అనే విషయం తెలియక, సినిమాకి ఎటువంటి కట్స్ చెప్పకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఒకవేళ జీవిత రాజశేఖర్ కనక ఇక్కడ సెన్సార్ చేసి ఉంటే, కనీసం కొన్ని కట్స్ అయినా ఇచ్చేవారు అని, ఇప్పుడు బెంగుళూరులో సెన్సార్ చెయ్యడం వలన సర్టిఫికెట్ ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఇచ్చేశారని తెలిసింది.

అయితే వర్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సెన్సార్ క్లియరెన్స్ కోసం దావూద్ ఇబ్రహీంతో ఫోను చేయించాను అని చెప్పిన విషయాన్ని కేంద్ర సమాచార శాఖ చాలా తీవ్రంగా తీసుకుందని, ఒక అంతర్జాతీయ క్రిమినల్, దేశద్రోహి అయిన దావూద్ ఇబ్రహీం పేరు వర్మ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. నిజంగానే వర్మకి, దావూద్ ఇబ్రహీం కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేక కేవలం ప్రచారానికి వర్మ ఆ పేరు వాడుకున్నారా అన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నారు అని తెలిసింది.

Updated Date - 2023-12-15T19:02:34+05:30 IST