RGV: అంతా వాళ్ళ వ్యూహం ప్రకారమే జరుగుతోంది, అందులో చూడటానికి ఏముంటుంది

ABN , First Publish Date - 2023-10-11T13:37:46+05:30 IST

ఆర్జీవీ ఒక అవుట్ డేటెడ్ దర్శకుడు, అతని సినిమాలు ఏవీ కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవటం లేదు. అలాంటి ఆర్జీవీ ఇప్పుడు ఏవో రెండు రాజకీయ సినిమాలతో వస్తున్నాను అని అన్నాడు. అవి కూడా ఆ పార్టీ ఇచ్చిన ఫండ్ తో తీస్తున్నవి, మరి అందులో ఆ పార్టీకి, పార్టీ నాయకుడికి భజన చేసే సన్నివేశాలు తప్పితే వేరేవి వుండవు అని కూడా అంటున్నారు.

RGV: అంతా వాళ్ళ వ్యూహం ప్రకారమే జరుగుతోంది, అందులో చూడటానికి ఏముంటుంది
Ram Gopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) కూడా తన సినిమాని రెండు పార్టులుగా విడుదల చేస్తున్నాను అని చెప్పాడు. 'వ్యూహం' #Vyooham మొదటి పార్టు, దీనికి సీక్వెల్ 'శపథం' #Sapatham రెండో పార్టు. ఈ రెండింటిలో కూడా చూడటానికి ఏముంటుంది, ఏమీ ఉండదు, జగన్ (YSJagan) భజన తప్ప అని నెటిజన్స్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆర్జీవీ (RGV) వైస్సార్సీపీ (YSRCP) డిజిటల్ మౌత్ పీస్ అని అందరూ అంటున్న సంగతి తెలిసిందే, అలాగే అతనికి ఆ పార్టీ నుండి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు ఉంటున్నాయి, అందుకనే ఆ పార్టీ డిజిటల్ ప్రమోషన్స్ ని తన మీద వేసుకొని ఆ పార్టీ ని, జగన్ ని ప్రమోట్ చేస్తున్నాడు.

ఇప్పుడు రాబోయే ఈ సినిమా కూడా జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తూ, ప్రతిపక్ష నాయకులని తనదైన శైలిలో తిడుతూ తీస్తాడు అని కూడా అంటున్నారు. దానికి వైఎస్సార్ మరణం తరువాత ఏమి జరిగింది అనేది తన కోణంలో తీశానని చెప్పుకుంటాడు. అయితే ఈ సినిమాలో ఏముంటుంది అనే విషయం ముందుగానే ఊహించి చెప్పొచ్చు అని నెటిజన్స్ అంటున్నారు. అందుకే అతను ఇప్పుడు తీసిన ఈ రెండు సినిమాలని ప్రేక్షకులు అంతగా పట్టించుకోకపోవచ్చు అని కూడా అంటున్నారు.

RGV.jpg

ఎందుకంటే ఎప్పుడయితే ఆర్జీవీ ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసి, ఆ పార్టీకి భజన చేస్తున్నాడో అప్పటినుండి అతని సినిమాలు ఎవరూ చూడటం మానేశారు. ఆర్జీవీ హిట్ సినిమా ఏదైనా ఈమధ్యలో వచ్చింది చెప్పగలవా అని అడిగితే చాలా సేపు అలోచించి అప్పుడెప్పుడో విడుదలైన సినిమాల గురించి చెప్పాలి అని అంటున్నారు. అంతేకానీ ఈమధ్య ఆర్జీవీ దర్శకుడిగా అయితే పూర్తిగా ఫెయిల్ అయ్యాడు, అతన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు, ఇక అతని సినిమాల సంగతి అయితే సరే సరి అంటున్నారు.

ఈ రాబోయే సినిమాలు కూడా ఆ రాజకీయ పార్టీ ఇచ్చిన ఫండ్ తో తీసినవే అని అందరికీ తెలిసిన విషయమే అని కూడా సాంఘీక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అందుకని ఈ సినిమాల గురించి ఎవరూ పట్టించుకోరు, వూరికే పవన్ కళ్యాణ్ (PawanKalyan) ని, చంద్రబాబు నాయుడుని (ChandrababuNaidu) అలాంటి పోలికలు వున్న నటుల్ని పెట్టి ఎగతాళిగా చూపించడమే వర్మ తన సినిమాల ద్వారా చేసే పని. అంతే కానీ అందులో విషయం ఉండదు అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే అని అంటున్నారు.

ఇప్పుడు వర్మ ఒక అవుట్ డేటెడ్ దర్శకుడు అని నెటిజన్స్ అంటున్నారు. బాలీవుడ్ కి వెళ్లడం మానేసాడు, అక్కడ ఎవరూ పట్టించుకోవటం లేదు, అందుకని అక్కడికి వెళ్ళలేడు, ఇక చేసేదేముంది హైద్రాబాదులో ఆ రాజకీయ పార్టీ ఇచ్చిన ఫండ్ తో ఒక ఆఫీస్ కూడా ఈమధ్యనే ఓపెన్ చేసి, ఎలక్షన్స్ అయ్యేంతవరకు ఇలాంటి సినిమాలు, వీడియోలు కొన్ని తీసి ఆ పార్టీ వాళ్ళకి ఆనందం కలగచేస్తూ ఉండాలని వర్మ ఆలోచన అని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలని ప్రేక్షకులు ఎలాగూ ఆదరించరు, చూడరు. అందుకని పార్టీ వాళ్ళ కోసం తీసిన ఈ సినిమాలు ప్రేక్షకులకి కాకుండా, కేవలం పార్టీ వాళ్ళకే పనికొస్తాయి అని అంటున్నారు.

Updated Date - 2023-10-11T13:46:53+05:30 IST