RashmikaMandanna: ఈమె కూడా మేనేజర్ ని డిస్మిస్ చేసిందట.. ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-06-19T13:45:37+05:30 IST

'పుష్ప' సినిమాతో నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్న ఈమధ్య వార్తల్లో వుంది. అయితే ఇప్పుడు ఇంకో వార్తతో ఆమె పేరు వైరల్ అయింది. ఆమె తన మేనేజర్ ని డిస్మిస్ చేసిందని, ఆ విషయం నిర్మాతలు అందరికీ సమాచారం ఇచ్చినట్టుగా పరిశ్రమలో అంటున్నారు

RashmikaMandanna: ఈమె కూడా మేనేజర్ ని డిస్మిస్ చేసిందట.. ఎందుకంటే...
Rashmika Mandanna

కొన్ని రోజుల క్రితం నటుడు సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) కి, తన మేనేజర్ కి మధ్య ఏవో వాగ్వివాదాలు వచ్చాయని ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ తన మేనేజర్ ని తీసేసి కొత్త వ్యక్తిని మేనేజర్ గా పెట్టుకున్నాడని వార్తలు వచ్చాయి కదా. ఇప్పుడు అలాంటిదే ఇంకో వార్త చక్కర్లు కొడుతోంది. ఈసారి అగ్ర నటి, అటు బాలీవుడ్ లోనూ, ఇటు దక్షిణాదిలోనూ ఒక వెలుగు వెలుగుతున్న రష్మిక మందన్న (RashmikaMandanna) విషయంలో ఈ వార్త వచ్చింది. అందరూ నేషనల్ క్రష్ (NationalCrush) అని అంటున్న రష్మిక తన మేనేజర్ ని డిస్మిస్ చేసిందన్న వార్తలు పరిశ్రమలో బాగా వినిపిస్తోంది.

rashmikamandanna4.jpg

ఇంతకీ విషయం ఏంటంటే, రష్మిక నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కొంత తన మేనేజర్ దగ్గర దాచమని ఇచ్చిందని, అయితే మేనేజర్ ఆమెకి చెప్పకుండా ఆ డబ్బులో కొంత వాడేసాడు అని తెలిసింది. కొన్ని రోజుల తరువాత రష్మిక మళ్ళీ ఆ డబ్బు గురించి అడిగితే అప్పుడు తను అందులో కొంత వాడుకున్నట్టుగా రష్మిక కి చెప్పినట్టుగా తెలిసింది.

అయితే అక్కడే రష్మిక చాలా సీరియస్ అయింది అని కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఆమెకి చెప్పకుండా మేనేజర్ ఆమె డబ్బుని ఎలా వాడుకుంటాడు అనే పాయింట్ మీదే బాగా సీరియస్ అయి, ఆ తరువాత మాటల్లో మేనేజర్ ఏదో మాట తూలాడు అని కూడా తెలిసింది. దానితో కోపం వచ్చిన రష్మిక వెంటనే అతన్ని డిస్మిస్ చేసిందని కూడా తెలిసింది.

rashmikamandanna5.jpg

అయితే ఈ విషయం పరిశ్రమలో వాళ్లందరికీ ముఖ్యంగా నిర్మాతలకి తన మేనేజర్ కి కాల్ చెయ్యవద్దని రష్మిక చెప్పిందని, అప్పుడే ఈ విషయం కూడా బయట పడిందని వార్తలు వస్తున్నాయి. రష్మిక ఇప్పుడు అల్లు అర్జున్ (AlluArjun) నటిస్తున్న 'పుష్ప 2' (Pushpa2) సినిమాలో కథానాయకురాలిగా చేస్తోంది. ఆ సినిమా పార్టు వన్ లో ఆమె చేసిన పాత్రకి గాని ఆమెను నేషనల్ క్రష్ అని పిలుస్తున్నారు. రణబీర్ కపూర్ (RanbirKapoor)తో హిందీలో 'యానిమల్' (Animal) సినిమా కూడా చేస్తోంది, దీనికి సందీప్ రెడ్డి వంగా (SandeepReddyVanga) దర్శకుడు. అలాగే 'రెయిన్ బో' (Rainbow) అనే సినిమా కూడా దక్షిణాదిన చేస్తోంది. ఇప్పుడు డిమాండ్ వున్న నటీమణుల్లో రష్మిక ఒకరు. ఎవరిని ఇప్పుడు మేనేజర్ గా పెట్టుకుంది అనే విషయం ఇంకా తెలియలేదు అని కూడా అంటున్నారు.

Updated Date - 2023-06-19T13:45:37+05:30 IST