Skanda box office: రామ్, బోయపాటి సినిమా మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్

ABN , First Publish Date - 2023-09-29T14:31:43+05:30 IST

'స్కంద' సినిమా నిన్న థియేటర్స్ లో విడుదలైంది. మిశ్రమ టాక్ వచ్చింది. అయినా మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు ఓపెనింగ్స్ రావటం రామ్ కెరీర్ లో ఇదే బెస్ట్ అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

Skanda box office: రామ్, బోయపాటి సినిమా మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్
Ram Pothineni from Skanda film

రామ్ పోతినేని (RamPothineni), బోయపాటి శ్రీను (BoyapatiSreenu) కాంబినేషన్ లో వచ్చిన 'స్కంద' #Skanda సినిమా నిన్న థియేటర్స్ లో విడుదలైంది. ఇది ఒక యాక్షన్ డ్రామాగా బోయపాటి తెరకెక్కించాడు. ఇందులో శ్రీలీల (Sreeleela) కథానాయకురాలిగా చేసింది. దీనికి ప్రేక్షకుల నుండి మిశ్రమ టాక్ వచ్చింది. కొంతమంది ఈ సినిమాలో యాక్షన్ బాగుంది అంటే, కొంతమంది అదే మరీ ఎక్కువయిపోయింది, లాజిక్ లేకుండా తీసాడు బోయపాటి అన్నారు. #SkandaFirstDayCollection

ఇలా అందరూ అనుకుంటూ ఉంటే, ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే మాత్రం షాకింగ్ గా వుంది. ఇంత మిశ్రమ టాక్ లోనూ ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ రామ్ పోతినేని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని అంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మొదటి రోజు సుమారు రూ. 8.62 కోట్ల రూపాయలు షేర్ సంపాదించింది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఇది రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ అని కూడా చెపుతున్నారు.

SkandaFirstDayCollection1.jpg

అలాగే ఓవర్ సీస్, మిగతా ఇండియా ప్రాంతాలలో కలిపి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం సుమారుగా రూ.14.8 గ్రాస్ కలెక్టు చేసినట్టుగా చెపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వ్యాపారం సుమారు రూ. 40 కోట్ల వరకు జరిగిందని, అంత మొత్తం రాబట్టాలి అంటే, ఈ వారాంతం సినిమా బాగా నడవాలని అంటున్నారు. అలాగే సోమవారం కూడా సెలవు దినం కలిసి కావటంతో బయ్యర్లు రికవరీ చేసుకోవచ్చు అనే ఆశాభావంతో వున్నారు అని తెలుస్తోంది. మిశ్రమ టాక్ రావటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుందో అనే విషయం ఇక వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-09-29T14:31:43+05:30 IST