Skanda: బోయపాటి, రామ్ పోతినేని సినిమా వాయిదా వెయ్యడం లాభమా నష్టమా?

ABN , First Publish Date - 2023-09-09T15:36:28+05:30 IST

చాలా సినిమాలు సెప్టెంబర్ 28న పోటీ పడుతున్నాయి. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 'స్కంద' కూడా అదేరోజు విడుదలవుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే సెప్టెంబర్ 15న విడుదల కావలసి వుంది, కానీ 'సాలార్' విడుదల వాయిదా పడటం తో ఆ తేదీకి వెళ్ళింది 'స్కంద'. ఇప్పుడు సెప్టెంబర్ 15న సినిమాలు ఏమీ లేవు, మరి ఆ విడుదల వాయిందా వెయ్యటం లాభమా, నష్టమా ...

Skanda: బోయపాటి, రామ్ పోతినేని సినిమా వాయిదా వెయ్యడం లాభమా నష్టమా?
A still from Skanda

రామ్ పోతినేని (RamPothineni), బోయపాటి శ్రీను (BoyapatiSreenu) కాంబినేషన్ లో వస్తున్న 'స్కంద' #Skanda సినిమా ఈనెల 15న విడుదల కావాల్సి వుంది. అయితే ప్రభాస్ (Prabhas) నటించిన 'సాలార్' #Salaar ఈనెల నవంబర్ 28న విడుదల కావాల్సి వుంది, కానీ అది నిరవధికంగా వాయిదా పడతంతో, ఇప్పుడు ఈ 'స్కంద' సినిమాని ఆ తేదీకి విడుదల చెయ్యాలని సుమారు రెండు వారల పాటు పోస్టుపోన్ చేశారు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం అయితే, సినిమా ఈనెల 15న విడుదలయితేనే బాగుండేదేమో అని పరిశ్రమలో ఒక టాక్ కూడా నడుస్తోంది.

అయితే అదేరోజు మరికొన్ని సినిమాలు కూడా విడుదలవుతున్నాయి, కానీ 'స్కంద' మాత్రమే పెద్ద సినిమా అన్నిటికన్నా. రాఘవ లారెన్స్ (RaghavaLawrence), కంగనా రనౌత్ (KanganaRanaut) నటించిన 'చంద్రముఖి 2' (Chandramukhi2) కూడా అదే రోజుకి వాయిదా పడింది, ఇది కూడా పాన్ ఇండియన్ సినిమానే. అలాగే కిరణ్ అబ్బవరం (KiranAbbavaram) నటించిన 'రూల్స్ రంజన్' #RulesRanjann, ఇంకో చిన్న సినిమా 'మ్యాడ్' #MAD, హిందీ సినిమా 'వాక్సిన్ వార్' #VaccineWar అలాగే మరుసటి రోజు 'పెద కాపు' #PedaKapu విడుదలవుతున్నాయి. చాలా సినిమాలు 'సాలార్' విడుదల వాయిదా పడటంతో ఆ తేదీనే ఎంచుకున్నాయి.

Skanda-3.jpg

ఇంతకీ ఇన్ని సినిమాలు ఆరోజు కోసం ఎందుకు పోటీ పడుతున్నాయి అంటే, ఒక్క సెలవు రోజు కలిసి వచ్చింది, అందుకని. సెప్టెంబర్ 28, గురువారం అయితే, 29 (శుక్రవారం), 30 (శనివారం), అక్టోబర్ 1 (ఆదివారం) ఇలా ఉంటే, అక్టోబర్ 2 (సోమవారం) గాంధీ జయంతి కూడా సెలవు కావటంతో అందరూ సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు. అయితే ఆ ఒక్కరోజు కోసం చూసుకొని 'స్కంద' సినిమా కూడా అదేరోజుకి వెళ్ళింది.

కానీ సెప్టెంబర్ 15వ తేదీన చూస్తే, ఆరోజు ఒక్క సినిమా కూడా విడుదలవడం లేదు. విశాల్ నటించిన 'మార్క్ ఆంటోనీ' విడుదల కావాల్సి వుంది, కానీ అది డబ్బింగ్ సినిమా, అలాగే అది విడుదల అవుతుంది లేదో తెలీదు. అలాంటప్పుడు అదేరోజు 'స్కంద' విడుదలైతే, సోలోగా చాలా స్క్రీన్స్ లో విడుదల చేసుకోవచ్చు. ఇది ఆ సినిమాకి ఒక మంచి అవకాశం అని కూడా అంటున్నారు పరిశ్రమలో, కానీ 'స్కంద' విడుదల పోస్టుపోన్ చేసుకుంది. సినిమాలో దమ్ముండాలి కానీ, ఏరోజు విడుదల చేస్తే ఏంటి, అని పేరు చెప్పని ఒక నిర్మాత వ్యాఖ్యానించాడు. సెప్టెంబర్ 15న విడుదల చేసినా సోలో గా కలెక్షన్స్ వచ్చేవని అంటున్నారు. మరి ఇప్పుడు 'స్కంద' వాయిదా వెయ్యటం, నష్టమో లాభమో సెప్టెంబర్ 28న తెలుస్తుంది.

Updated Date - 2023-09-09T15:36:28+05:30 IST