Skanda: రామ్ పోతినేని, బోయపాటి సినిమాకి విడుదలవ్వకముందే లాభాలు

ABN , First Publish Date - 2023-08-31T14:26:28+05:30 IST

రామ్ పోతినేని ముందు సినిమా 'వారియర్' పెద్ద డిజాస్టర్, అయితే బోయపాటి ముందు సినిమా 'అఖండ' ఓటిటి లో బాగా చూసారు, అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరూ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ సినిమా 'స్కంద' ఓటిటి హక్కులు పెద్ద అమౌంట్ కి అమ్ముడుపోయాయి. థియేట్రికల్ హక్కులు ఎలా అమ్ముడుపోతాయో చూడాలి

Skanda: రామ్ పోతినేని, బోయపాటి సినిమాకి విడుదలవ్వకముందే లాభాలు
Ram Pothineni and Sreeleela from Skanda

రామ్ పోతినేని (RamPothineni), బోయపాటి శ్రీనివాస్ (BoyapatiSrinivas) సినిమా 'స్కంద' #Skanda సెప్టెంబర్ 15న విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది, అందులో బోయపాటి మార్కు అదే నరుక్కునే సన్నివేశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. శ్రీలీల (Sreeleela) కథానాయకి, థమన్ (SSThaman) సంగీతం అందించాడు, ఈ సినిమాలో పాటలు వైరల్ అయ్యాయి కూడా. నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చి సినిమా యూనిట్ కి విషెస్ చెప్పాడు. అలాగే ఇందులో సాయి మంజ్రేకర్ (SaieeMmanjrekar) కూడా వుంది.

rampothineni-skanda.jpg

ఇదిలా ఉండగా ఈ సినిమా నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ (ChitturiSrinivas) ఈ సినిమా సాటిలైట్, ఓటిటి చానెల్స్ తో మంచి డీల్ కుదుర్చుకున్నాడు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. దక్షిణాదికి చెందిన నాలుగు భాషలు అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఓటిటి, అలాగే సాటిలైట్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) కి అమ్మినట్టుగా తెలిసింది. దీని ద్వారా నిర్మాతకి రూ. 54 కోట్లు వచ్చిందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అలాగే ఈ సినిమా హిందీ ఓటిటి, సాటిలైట్ హక్కులు జీ స్టూడియో (ZeeStudio) వాళ్ళు రూ.35 కోట్లకు కొనుక్కున్నారని, ఇది కాకుండా ఈ చిత్రం ఆడియో హక్కులు కూడా రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది, ఇవన్నీ కలిపితే సుమారు రూ. 98 కోట్లు ఇక్కడే నిర్మాతకి వచ్చిందని తెలుస్తోంది.

ఏ రకంగా చూసిన ఈ సినిమా నిర్మాతకి విడుదలకి ముందే లాభాలు వచ్చాయని, ఇక సినిమా విడుదల తరువాత థియేటర్స్ రైట్స్ మీద వస్తే అవన్నీ కూడా లాభాల పంట పండుతుందని తెలుస్తోంది.

Updated Date - 2023-08-31T14:26:28+05:30 IST