Rajinikanth: జైల్లో చంద్రబాబుని కలవనున్న సూపర్ స్టార్ రజినీకాంత్

ABN , First Publish Date - 2023-09-16T12:15:01+05:30 IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలవడానికి రాజమండ్రి రావొచ్చు అనే వార్త తమిళ మీడియాలో వస్తోంది. చంద్రబాబుకి ధైర్యం చెప్పడానికి జైల్లో అతన్ని కలిసే అవకాశం వుంది అని అంటున్నారు.

Rajinikanth: జైల్లో చంద్రబాబుని కలవనున్న సూపర్ స్టార్ రజినీకాంత్
File picture of Rajinikanth and Chandrababu Naidu

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (NaraChandrababuNaidu) ఇద్దరూ మంచి మిత్రులన్న సంగతి అందరికి తెలిసిందే. ఎన్నో సార్లు రజినీకాంత్ తన మిత్రుడు చంద్రబాబు గురించి మంచి మాటలు చెప్పారు, అలాగే ఆమధ్య ఎన్టీఆర్ శతజయంతి (NTR) ఉత్సవాల్లో పాల్గొండటానికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబుని ఎంతో ప్రశంసించారు రజినీకాంత్. కొన్ని రోజుల క్రితం చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు కూడా అతను క్లీన్ గా బయటకి వస్తాడు అని చెప్పారు, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ (NaraLokesh) తో మాట్లాడి అతనికి ధైర్యం చెప్పారు.

అయితే ఇప్పుడు తమిళ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. రజినీకాంత్ త్వరలో రాజమండ్రి జైల్లో వున్న చంద్రబాబును కలుస్తారు అని. ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అయింది. తనకి మంచి మిత్రుడు అయిన చంద్రబాబు జైల్లో ఉంటే, ధైర్యం చెప్పడానికి రజినీకాంత్ అతన్ని రాజమండ్రి జైల్లో కలవనున్నారు అని అంటున్నారు. అయితే ఈ వార్త ఇంకా ధ్రువీకరించలేదు కానీ, తమిళ మీడియా లో మాత్రం వైరల్ గా మారింది.

rajinikanth-babu1.jpg

చంద్రబాబు, రజినీకాంత్ ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు టచ్ లో వుంటారు కూడా. ఆమధ్య విజయవాడ వచ్చి చంద్రబాబుని ప్రశంసించినప్పుడు, వైస్సార్సీపీ (YSRCP) నాయకులు చాలామంది రజినీకాంత్ మీద నోరు పారేసుకున్నారు. కానీ రజినీకాంత్ అసలు వాళ్ళు అన్నమాటలని పట్టించుకోలేదు. 'జైలర్' #Jailer ప్రీ రిలీజ్ వేడుకలో రజినీకాంత్ ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి అన్న మాటలు వైరల్ అయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. "ఈ లోకంలో మొరగని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు, ఇవి రెండూ జరగని వూరు ఉండదు. మన పని మనము చేసుకుంటూ, ముందుకు పోవాలి. అర్థమైందా రాజా," అని అన్న డైలాగ్ ఎంతో వైరల్ అయింది. అందుకే రజిని తను అనుకున్న పని చెయ్యటంలో ముందుంటాడు, అప్పుడు ఎవరు ఎన్ని విమర్శించినా పట్టించుకోరు, అందుకే అతను సూపర్ స్టార్ అయ్యారు.

Updated Date - 2023-09-16T12:15:01+05:30 IST