Salaar: దర్శక నిర్మాతలని ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్, ఈసారయినా కరెక్టు తేదీ చెపుతారా...

ABN , First Publish Date - 2023-09-06T10:55:31+05:30 IST

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న 'సలార్' మరోసారి వాయిదా పడింది. ఈసారి ప్రభాస్ అభిమానులు దర్శక, నిర్మాతలని ట్రోల్ చేస్తున్నారు. కొత్త విడుదల తేదీని ప్రకటించి ఈసారి ఆ తేదీకి విడుదల చేస్తారా, మళ్ళీ వాయిదా వేస్తారా అని అడుగుతున్నారు. నిర్మాతలు రానున్న కొన్ని రోజుల్లో ఈ కొత్త తేదీని ప్రకటించే అవకాశం వుంది.

Salaar: దర్శక నిర్మాతలని ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్, ఈసారయినా కరెక్టు తేదీ చెపుతారా...
Salaar release postponed

మొత్తానికి అనుకున్నది అంతా అయింది. ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ (PrashanthNeel) కాంబినేషన్ లో వస్తున్న 'సాలార్' #Salaar మూవీ పోస్టుపోన్ అయింది. అధికారికంగా నిర్మాతలు అయిన హోంబలే ఫిలిమ్స్ (HombaleFilms) ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ సినిమా పోస్టుపోన్ అయిపొయింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. 'సాలార్' విడుదల సెప్టెంబర్ 28, 2023 నాడు విడుదల అవటం లేదు అని తెలిసిన తరువాత ఒక డజను సినిమాలు తమ విడుదలని, వాయిదాలని ప్రకటించాయి.

రామ్ పోతినేని (RamPothineni), బోయపాటి శ్రీను (BoyapatiSrinu) కాంబినేషన్ లో వస్తున్న 'స్కంద' #Skanda సెప్టెంబర్ 28న విడుదల అవుతోంది. ఆ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి వుంది, కానీ ఇప్పుడు 'సాలార్' #Salaar తేదీకి వస్తోంది. అలాగే చాలా సినిమాలు శ్రీకాంత్ అడ్డాల (SrikanthAddala) దర్శకత్వంలో వస్తున్న 'పెదకాపు' (Pedakapu) కూడా అదే తేదీకి వస్తోంది. ఇలా చాలా సినిమాలు తమ తమ విడుదల తేదీలను ప్రకటించాయి.

Prabhas.jpg

ఇదిలా ఉండగా, ప్రభాస్ అభిమానులు మాత్రం నిర్మాతలు అయినా హోంబలె ఫిలిమ్స్ ని, దర్శకుడు ప్రశాంత్ నీల్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా విడుదల ఎప్పుడు అని అడుగుతున్నారు. ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం అయితే, గత సంవత్సరం విడుదల కావలసి వుంది, కానీ మళ్ళీ ఈ సంవత్సరం ఏప్రిల్ అన్నారు, మళ్ళీ సెప్టెంబర్ 28 కి విడుదల అన్నారు. ఇన్నిసార్లు పోస్టుపోన్ చేసి, ఇప్పుడు మళ్ళీ వాయిదా పడుతోంది.

ఈసారి అయితే ఈ సినిమా విడుదల తేదీ కరెక్టుగా చెపుతారా అని అభిమానులు అడుగుతున్నారు. ఈ సినిమా టీజర్ అప్పుడెప్పుడో విడుదల చేశారు. అంతే ఆ తరువాత ఆ సినిమా గురించి మళ్ళీ ఎటువంటి ప్రకటన గానీ, ఎటువంటి వార్త కానీ లేదు. కనీసం పాటలు అయినా విడుదల చేస్తారు అనుకుంటే అదీ లేదు. అభిమానులు ఈ 'సాలార్' మీదే ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు నిర్మాతలు కొత్త విడుదల తేదీని ప్రకటించే ముందు గానే చూసుకొని చెప్పాలి, లేదంటే మళ్ళీ అవమానం పాలు అవుతారు.

'సాలార్' సినిమా వ్యాపారాల లావాదేవీలు కూడా చాలా పెద్ద మొత్తంలో వున్నాయి. సినిమా తేడా వచ్చిందంటే, డిస్ట్రిబ్యూటర్స్ ఈసారి తట్టుకోగలరా అనే సందేహం కూడా వస్తోంది. అంతలా ఈ సినిమా ఏరియా హక్కులు అడుగుతున్నారు నిర్మాతలు. ఇందులో శృతి హాసన్ (ShrutiHaasan) కథానాయిక కాగా, మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (PrudhvirajSukumaran) కూడా వున్నారు. ఈ సినిమా కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు, కానీ ఇలా విడుదల వాయిదాలు పడటంతో నిరుత్సాహపడుతున్నారు.

Updated Date - 2023-09-06T11:07:50+05:30 IST