Prabhas: ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్!

ABN , First Publish Date - 2023-01-29T20:33:55+05:30 IST

‘బాహుబలి’ (Baahubali) తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో రెబల్ స్టార్ వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ వంటి చిత్రాలు చేస్తున్నాడు.

Prabhas: ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్!

‘బాహుబలి’ (Baahubali) తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో రెబల్ స్టార్ వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ వంటి చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్టు గురించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘పఠాన్’ (Pathaan) డైరెక్టర్‌తో డార్లింగ్ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand). యాక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని అతడికీ పేరుంది. అదే బాటలోనే పయనిస్తూ తాజాగా ‘పఠాన్’ కు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కూడా కీలక పాత్ర పోషించనున్నాడని సమాచారం. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించనుంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టులున్నాయి. ఈ సినిమాలన్ని పూర్తయిన తర్వాత 2024లో ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ చిత్రం 2025లో థియేటర్స్‌లో విడుదల కానుంది. సిద్దార్థ్ గతంలో హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ ను తెరకెక్కించాడు.

Updated Date - 2023-01-29T22:28:57+05:30 IST