Chiranjeevi: మరో సినిమాను రీమేక్ చేయనున్నారా..?

ABN , First Publish Date - 2023-01-19T17:16:51+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విరామం అనేది లేకుండా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ (Bhola Shankar) లో నటిస్తున్నారు. అజిత్ నటించిన ‘వేదళం’ (Vedalam) కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Chiranjeevi: మరో సినిమాను రీమేక్ చేయనున్నారా..?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విరామం అనేది లేకుండా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ (Bhola Shankar) లో నటిస్తున్నారు. అజిత్ నటించిన ‘వేదళం’ (Vedalam) కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వేసవి కానుకగా మూవీ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ఫిక్స్ అయినట్టు ఫిల్మ్ నగర్‌లో రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. మరో చిత్రాన్ని మెగాస్టార్ రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది.

అజిత్ నటించిన ‘విశ్వాసం’ (Viswasam)ను మెగాస్టార్ రీమేక్ చేయనున్నారని సమాచారం. వివి. వినాయక్ (VV Vinayak) దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. వివి. వినాయక్‌కు పూర్తి స్క్రిఫ్ట్‌ను డిజైన్ చేయమని చిరు సూచించినట్టు వదంతులు షికార్లు కొడుతున్నాయి. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ‘విశ్వాసం’ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. సిరుతై శివ దర్శకత్వం వహించారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ రూపొందించింది. అజిత్ కుమార్, నయనతార, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిరు కొన్నాళ్ల క్రితమే ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించారు. ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇక చిరంజీవి కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) లో నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.

Updated Date - 2023-01-19T17:26:53+05:30 IST